Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ ర్యాపిడ్ చెస్‌: మళ్లీ ఆనంద్ నంబర్ వన్

హైదరాబాద్: ప్రపంచ ర్యాపిడ్ చెస్ పోటీల్లో ఆనంద్ మళ్లీ నంబర్.1గా నిలిచాడు. ఇంతకుముందు నంబర్ .1గా ఉన్న మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించిన రష్యా గ్రాండ్ మాస్టర్ వ్లాదిమిర్ ఫెదోసివ్‌ను ఆనంద్ చిత్తు చేశాడు. ఇంకే ముంది ఆనంద్‌కు తిరుగులేకుండా పోయింది. ఈ గేమ్‌తో అతనికి ప్రపంచ ఛాంపియన్ షిప్ సొంతమైనట్లే.

 టైటిల్‌ ఒడిసిపట్టాడు

టైటిల్‌ ఒడిసిపట్టాడు

ఉత్కంఠభరితంగా సాగిన పోరాటంలో పదిహేను రౌండ్లు ముగిసేసరికి 10.5 పాయింట్లతో అతడు వ్లాదిమిర్‌ ఫెదోసివ్‌ (రష్యా), ఇయాన్‌ నెపోమ్నియాచి (రష్యా)లతో సమానంగా నిలిచాడు. టైబ్రేక్‌లో ఫెదోసివ్‌ను 2-0తో ఓడించి టైటిల్‌ ఒడిసిపట్టాడు. 48 ఏళ్ల ఆనంద్‌ 14 ఏళ్ల తర్వాత ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ దక్కించుకున్నాడు.

 తొలి మూడు గేమ్‌లు డ్రా అయినప్పటికీ..

తొలి మూడు గేమ్‌లు డ్రా అయినప్పటికీ..

తొలి పది రౌండ్లలో అజేయంగా నిలిచిన ఆనంద్‌.. టోర్నీలో ఆఖరి రోజు రికార్డును కొనసాగించాడు. గురువారం తొలి మూడు గేమ్‌లను అతడు డ్రాగా ముగించాడు. పీటర్‌ స్విద్లర్‌ (రష్యా), ఇయాన్‌ నెపోమ్నియాచి (రష్యా), వ్లాదిమిర్‌ ఒనిచుక్‌ (ఉక్రెయిన్‌)తో గేమ్‌లను వరుసగా డ్రా చేసుకున్నాడు. దీంతో అతడు 9 పాయింట్లతో టైటిల్‌ రేసులో వెనకబడ్డాడు. ఆ తర్వాత కీలక గేమ్‌లో అలెగ్జాండర్‌ గ్రిస్చుక్‌ (రష్యా)పై విజయం సాధించి మళ్లీ రేసులోకి వచ్చాడు.

 ముందే దక్కేది:

ముందే దక్కేది:

కీలకమైన ఆఖరి గేమ్‌లో విజయం సాధించివుంటే టైటిల్‌ ఆనంద్‌కే దక్కేది. కానీ.. బు జియాంగ్జి (చైనా)తో గేమ్‌ను అతడు డ్రాతో సరిపెట్టుకున్నాడు. 21 ఎత్తుల్లో ఈ గేమ్‌ ముగిసింది. మరోవైపు పద్నాలుగు రౌండ్లు ముగిసేసరికి ఆనంద్‌తో 10 పాయింట్లతో సమానంగా ఉన్న మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (10) తన చివరి గేమ్‌లో ఓడిపోయాడు. దీంతో ఆనంద్‌కు టైటిల్‌ గెలిచేందుకు అవకాశం లభించింది.

 టైబ్రేక్‌ అనివార్యమైంది.

టైబ్రేక్‌ అనివార్యమైంది.

ఆనంద్‌, వ్లాదిమిర్‌ ఫెదరోసివ్‌ (రష్యా), ఇయాన్‌ నెపోమ్నియాచిలు 10.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలవడంతో.. విజేతను నిర్ణయించడానికి టైబ్రేక్‌ అనివార్యమైంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఆనంద్‌, ఫెదోసివ్‌ మధ్య ఛాంపియన్‌షిప్‌ కోసం టైబ్రేక్‌ నిర్వహించారు. ఆనంద్‌ వరుసగా రెండు విజయాలు సాధించి టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. ర్యాపిడ్‌లో తనకు తిరుగులేదని నిరూపించాడు.

 ఫెదోసివ్‌ నిలవలేకపోయాడు.

ఫెదోసివ్‌ నిలవలేకపోయాడు.

తొలి గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన ఆనంద్‌ 41 ఎత్తుల్లో విజయాన్ని అందుకున్నాడు. ఈ గేమ్‌లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ఆనంద్‌దే. రెండో గేమ్‌లో నల్ల పావులతో ఆడిన ఆనంద్‌.. ఆరంభం నుంచి ఎదురుదాడి చేశాడు. పెద్ద టోర్నీల్లో ఒత్తిడిలో ఎన్నో వందల మ్యాచ్‌లు ఆడిన అనుభవం కలిగిన ఆనంద్‌ ముందు ఫెదోసివ్‌ నిలవలేకపోయాడు.

 అంతటితో ఆగిపోలేదు

అంతటితో ఆగిపోలేదు

ఆనంద్‌ వేగానికి ఫెదోసివ్‌ తలవంచక తప్పలేదు. 39 ఎత్తుల్లో అతడు ఓటమి పాలయ్యాడు. ఆనంద్‌ చివరగా 2003లో క్రామ్నిక్‌ను ఓడించి ప్రపంచ ర్యాపిడ్‌ ఛాంపియన్‌గా నిలిచాడు. 2014లో చివరగా ఆనంద్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. ఆ తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోరులో వరుసగా రెండుసార్లు మాగ్నస్‌ కార్ల్‌సన్‌ చేతిలో ఓడిపోయాడు. మరో రోజు విరామంతో ఆనంద్‌ మరో ప్రపంచ టైటిల్‌ కోసం తలపడనున్నాడు.

Story first published: Friday, December 29, 2017, 10:45 [IST]
Other articles published on Dec 29, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+