Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లండన్ క్లాసిక్ టైటిల్ గెలుచుకున్న ఆనంద్

లండన్: ఇటీవల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కార్ల్‌సన్ చేతిలో ఓటమిపాలైన విశ్వనాథన్ ఆనంద్ మళ్లీ పుంజుకున్నాడు. ఈ భారత గ్రాండ్‌మాస్టర్ సోమవారం జరిగిన లండన్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్లో ఛాంపియన్‌గా నిలిచి సత్తాచాటాడు.

చివరిదైన ఐదోరౌండ్లో బ్రిటిష్ గ్రాండ్‌మాస్టర్ మైకేల్ ఆడమ్స్‌పై విజయం సాధించి ఆనంద్ ట్రోఫీ అందుకున్నాడు. ఆరుగురు క్రీడాకారులు పోటీపడ్డ ఈ రౌండ్‌రాబిన్ టోర్నీలో తొలి నాలుగుగేమ్‌లు డ్రాగా ముగించిన ఆనంద్, ఆఖరిరౌండ్లో విజయంతో మొత్తం ఏడు పాయింట్లు సాధించాడు.

Viswanathan Anand beats Michael Adams to win London Classic

దీంతో మరో ఇద్దరు ఆటగాళ్లు అనిష్ గిరి (నెదర్లాండ్స్), క్రామ్నిక్ (రష్యా)లతో కలిసి సంయుక్తంగా 7పాయింట్లతో సమంగా నిలిచిన ఆనంద్.. సూపర్ టైబ్రేక్‌లో విజయం సాధించి టైటిల్ దక్కించుకున్నాడు. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన 45ఏండ్ల ఆనంద్‌కిది కెరీర్‌లో తొలి లండన్ క్లాసిక్ టైటిల్ కావడం విశేషం.

ఇక టైటిల్‌వేటలో ఆనంద్‌కు పోటీదారుగా భావించిన నకముర (అమెరికా) 6పాయింట్లతో నాలుగోస్థానానికి పడిపోగా, ప్రపంచ నంబర్ టూ ర్యాంకర్ ఫాబియానో కరువానా, ఆడమ్స్‌లు చెరో నాలుగుపాయింట్లతో ఆఖరిస్థానాల్లో నిలిచారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+