ముంబై: మాజీ క్రకెటర్ వినోద్ కాంబ్లీ మరోసారి న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాడు. పని మనిషి పైన దాడి చేసి, వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు అతని పైన వస్తున్నాయి. దీంతో అతని పైన పోలీసులు కేసు నమోదు చేశారు.
జీతం అడిగినందుకు తన పైన కాంబ్లీ, ఆయన భార్య ఆండ్రియా దాడి చేశారని పని మనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మూడు రోజుల పాటు చీకటి గదిలో బంధించారని ఆరోపించింది. తమ ఇంటి దరిదాపుల్లో కనబడవద్దని హెచ్చరించారని, ఆ తర్వాతే విడిచిపెట్టారని ఆరోపించింది.

తనకు రెండేళ్లుగా వినోద్ కాంబ్లీ జీతం ఇవ్వడం లేదని తెలిపింది. తాను కాంబ్లీ ఇంట్లోనే ఉంటున్నట్టు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాంబ్లీ, భార్య ఆండ్రియాల పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.