Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Vinesh Phogat: కరోనా నుంచి కోలుకున్న రెజ్ల‌ర్ వినేష్‌ ఫోగాట్‌!!

Vinesh Phogat recovers from Coronavirus, tests negative twice

న్యూఢిల్లీ: కరోనా వైరస్ భారిన పడిన భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ కోలుకున్నారు. మంగళవారం రెండోసారి నిర్వ‌హించిన కరోనా పరీక్ష సైతం నెగెటివ్‌గా వ‌చ్చిన‌ట్లు ఆమె తెలిపారు. అయితే ముందు జాగ్ర‌త్త‌గా మ‌రికొన్ని రోజుల‌ పాటు ఐసోలేష‌న్‌లో ఉండ‌నున్న‌ట్లు వినేశ్‌ ఫోగట్‌ చెప్పారు. కరోనా పాజిటివ్ కార‌ణంగా ఆగ‌స్టు 29న జ‌రిగిన వ‌ర్చువ‌ల్ నేష‌న‌ల్ స్పోర్ట్స్ అవార్డుల వేడుక‌లో ఆమె పాల్గొన‌లేదు. దీంతో రాజీవ్ ఖేల్‌ర‌త్న అవార్డును అందుకోలేక‌పోయారు.

జాతీయ క్రీడా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా అవార్డుల కార్యక్రమం కోసం జరిగిన రిహార్సల్స్‌కు హాజరు కావడానికి ముందు వినేశ్ ఫోగాట్‌‌.. కరోనా పరీక్ష చేయించుకున్నారు. ఇందులో ఆమెకు వైరస్‌ సోకినట్లు బయటపడింది. దీంతో రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న పురస్కారానికి ఎంపికైన వినేశ్‌.. గత శనివారం జరిగిన అవార్డుల కార్యక్రమానికి దూరం అయ్యారు. అప్పటినుండి వినేష్‌ ఐసోలేష‌న్‌లోనే ఉన్నారు. మంగళవారం రెండోసారి నిర్వ‌హించిన కరోనా పరీక్ష సైతం నెగెటివ్‌గా వ‌చ్చిన‌ట్లు ఆమె తెలిపారు.

త‌న ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్ర‌తి ఒక్క‌రికి 24 ఏళ్ల వినేశ్ ఫోగాట్‌‌ ధ‌న్య‌వాదాలు తెలిపారు. 'మంగళవారం రెండోసారి వైరస్ పరీక్ష చేయించుకున్నాను. నెగటివ్ అని ఫలితం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. మంచి వార్తే అయినా.. ముందు జాగ్రత్త చర్యగా నేను మరికొన్ని రోజులు ఒంటరిగా ఉండాలనుకుంటున్నా. నా ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు' అని వినేష్ ట్వీట్ చేశారు.

టోక్యో ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన ఏకైక మ‌హిళా రెజ్ల‌ర్ వినేష్ ఫోగాట్‌. కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి కార‌ణంగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లక్నోలో జ‌రిగే మహిళల జాతీయ శిక్షణా శిబిరాన్ని వాయిదా వేయవలసి వచ్చింది. ఈ శిబిరం సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభం కావాల్సి ఉంది. కాగా పురుషుల శిబిరం సోనెపట్‌లో షెడ్యూల్ ప్రకారం ప్రారంభమైంది.

Story first published: Wednesday, September 2, 2020, 17:37 [IST]
Other articles published on Sep 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+