For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెజ్లింగ్‌ ఫైనల్ పోటీలో రజితంతో సరిపెట్టుకున్న ఫోగట్ సిస్టర్

Vinesh Phogat enters final of Asian Wrestling Championship

హైదరాబాద్: ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో వినేష్ ఫోగట్ భారత్‌కు పతకం ఖాయం చేసింది. వినేష్ ఫోగట్ 50 కిలోల విభాగంలో జపాన్‌కు చెందిన యుకీ ఐరీని ఓడించిన ఫోగట్ రెజ్లింగ్ పోటీల్లో ఫైనల్ చేరింది. ఈ పోటీలో 2-3 తేడాతో చైనాకు చెందిన చున్‌ లీ చేతిలో ఓటమిపాలై రజితంతో సరిపెట్టుకుంది.

ఈమె బబితా కుమారి ఫోగట్, గీతా ఫోగట్‌ల సోదరి. కామన్వెల్త్‌ పోటీల్లో, ఒలింపిక్స్‌లో సైతం ఈ అక్కాచెల్లెళ్లు ఎన్నో పతకాలు తెచ్చిపెట్టారు. వీళ్ల జీవితాల ఆధారంగా ఆమిర్ ఖాన్ 'దంగల్' అనే సినిమాను సైతం తెరకెక్కించారు.

2014 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన ఫోగట్.. తుది పోరులో చైనాకు చెందిన చున్ లీతో పోటీ పడనుంది. మరో భారత మహిళా రెజ్లర్ సంగీత కాంస్య పతకం కోసం పోటీ పడుతోంది. కొరియాకు చెందిన కియున్ ఉమ్‌తో 59 కిలోల విభాగంలో ఆమె తలపడనుంది.
భారత్‌కు చెందిన గ్రీకో-రోమన్ రెజ్లర్లు హర్‌ప్రీత్ సింగ్, రాజేంద్ర కుమార్ కాంస్య పతకాలు సాధించారు.

హర్‌ప్రీత్ 82 కిలోల విభాగంలో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ఖషీంబేకోవ్‌ను 11-3 తేడాతో చిత్తు చేశాడు. రాజేంద్ర కుమార్ 55 కిలోల విభాగంలో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన మిరాఖ్‌మెదోవ్‌ను ఓడించి కాంస్యం దక్కించుకున్నాడు. 3-3తో పాయింట్లు సమంగా ఉన్నప్పటికీ.. విజయం రాజేంద్ర కుమార్‌నే వరించింది. మిగిలిన రెజ్లర్లు విక్రమ్ కృష్ నాథ్ (63)కేజీలు, సునీల్ కుమార్(87), హర్‌దీప్ సింగ్(97)కేజీల విభాగంలో తొలి రౌండ్ లోనే వెనుదిరిగారు.

Story first published: Friday, March 2, 2018, 9:28 [IST]
Other articles published on Mar 2, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+