Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత ఐదో మహిళ రెజ్లర్‌గా వినేశ్ పోగ‌ట్‌ అరుదైన ఘనత

హైదరాబాద్: క‌జ‌కిస్తాన్‌ వేదికగా జ‌రుగుతున్న‌ వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ చాంపియ‌న్‌షిప్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ పోగ‌ట్‌ అరుదైన ఘనత సాధించింది. ఈ మెగా టోర్నీలో వినేశ్ పోగ‌ట్‌ కాంస్య పతకం సాధించింది. రెపిఛేజ్‌ ద్వారా 53 కిలోల ఈవెంట్‌లో పాల్గొన్న వినేశ్ ఫోగట్ త‌న ప్ర‌త్య‌ర్థి మారియా ప్రివోల‌రికీపై 4-1 తేడాతో విజయం సాధించింది.

వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ చాంపియ‌న్‌షిప్‌లో వినేశ్ ఫోగట్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. దీంతో పాటు వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ చాంపియ‌న్‌షిప్‌లో పతకం సాధించిన భారత ఐదో మహిళా రెజ్లర్‌‌గా అరుదైన ఘనత సాధించింది. అంతకు ముందు అల్కా తోమర్‌ (2006), గీతా ఫొగాట్‌ (2012), బబితా ఫొగాట్‌ (2012) పూజా ధండా (2018) పతకాలు సాధించారు.

ఈ చాంపియ‌న్‌షిప్‌లో మూడుసార్లు విఫలమైన వినేశ్‌ నాలుగోసారి పతకం సాధించింది. ఈ చాంపియ‌న్‌షిప్‌లో తొలుత జపాన్‌ రెజ్లర్‌ మేయు ముకైదాతో తలపడిన వినేశ్ ఫోగట్ ఓడిపోయింది. అయితే, మేయు ఫైనల్‌ చేరుకోవడంతో వినేశ్‌కు రెపిఛేజ్‌ రూపంలో అవకాశం వచ్చింది. ఈ పతకంతో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి రెజ్లర్‌గా గుర్తింపు పొందింది.

ఇదే చాంపియ‌న్‌షిప్‌లో మరో భారత రెజ్లర్ పూజా ధండా సెమీస్‌లో టెక్నికల్‌ సుపీరియారిటీతో లియుబోవ్‌ (రష్యా) చేతిలో ఓడిపోయింది. ప్రస్తుతం కాంస్య పతకం కోసం పోరాడనుంది. ఈ వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ చాంపియ‌న్‌షిప్‌లో తాను సాధించిన పతకాన్ని వినేశ్ ఫోగట్ దేశానికి అంకితం చేసింది.

మ్యాచ్ అనంతరం వినేశ్ ఫోగట్ మాట్లాడుతూ "పతకం సాధించడం చాలా గ‌ర్వంగా ఉంది. గత ఐదేళ్లుగా పతకం కోసం ప్రయత్నిస్తున్నా. ఒలింపిక్ కోటా కూడా సాధించ‌డం గ‌ర్వంగా ఉంది" తెలిపింది.

Story first published: Wednesday, September 18, 2019, 22:16 [IST]
Other articles published on Sep 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+