
రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన వినేశ్ ఫోగాట్
ఈ క్రమంలో వినేశ్ ఫోగాట్‌ను 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అర్జున అవార్జుతో సత్కరించింది. శుక్రవారం చైనాలో జరిగిన వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో వినేశ్ పోగట్ కాంస్య పతకం గెలిచింది. మరోవైపు రాహుల్ అవారే, హర్‌ప్రీత్ సింగ్, దివ్యా కాక్రన్, పూజా దండాలకు అర్జున్ అవార్డు ఇవ్వాలని డబ్ల్యుఎఫ్‌ఐ ప్రతిఫాదన పంపింది.

2018లో భజరంగ్ పూనియా సక్సెస్
అలాగే కోచ్‌లు విరేంద్ర కుమార్, సుజీత్ మాన్, నరేంద్ర కుమార్, విక్రమ్ కుమార్‌లను ద్రోణాచర్య అవార్డుకు సిఫారసు చేసింది. ఇక, భజరంగ్ పూనియా 2018లో అత్యంత విజయవంతమైన రెజ్లర్‌గా తన పేరుని పుస్తకాల్లో లిఖించాడు. జకార్త్ వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌లో గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 65 కేజీల విభాగంలో స్వర్ణ పతకాలు సాధించాడు.

రెజ్లింగ్‌లో నెంబర్ వన్ ర్యాంకు
దీంతో పాటు రెజ్లింగ్‌లో నెంబర్ వన్ ర్యాంకుని కూడా కైవసం చేసుకున్నాడు. భారత్ తరుపున రెజ్లింగ్‌లో నెంబర్ వన్ ర్యాంకుని అందుకున్న ఆటగాడిగా భజరంగ్ పూనియా చరిత్రకెక్కాడు. కాగా, 2015లో కేంద్ర ప్రభుత్వం భజరంగ్ పూనియాని అర్జున అవార్డుతో సత్కరించింది. మరోవైపు భీమ్ సింగ్, జై ప్రకాష్ పేర్లను ధ్యాన్ చంద్ అవార్డుకి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సిఫారసు చేసింది.

బీసీసీఐ సైతం అర్జున అవార్డుకు సిఫారసు
బీసీసీఐ సైతం రెండు రోజుల క్రితం అర్జున అవార్డుల కోసం ప్రతిపాదన చేసింది. ప్రతిష్టాత్మక అర్జున అవార్డు కోసం పేసర్ మహ్మద్ షమీ, బుమ్రా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్‌ల పేర్లను బీసీసీఐ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications
