కొట్టి భారత్ పంపిస్తా: హ్యుసెనోవ్, నవ్వేసిన విజేందర్
న్యూఢిల్లీ: ఈ నెల 19వ తేదీన జరుగుతున్న బౌట్‌లో బాక్సర్ విజేందర్ సింగ్ మక్కీలు విరగ్గొట్టి, భారత్ పంపిస్తానని సామెట్ హ్యూసెనోవ్ హెచ్చరిస్తే అందుకు విజేందర్... నవ్వే సమాధానం అయింది.
విజేందర్.. నిన్ను కొట్టి, నీ ఎముకలు విరిచి భారత్‌కు పంపిస్తాగనని బల్గేరియా బాక్సర్ హ్యుసెనోవ్ హెచ్చరించాడు. దానికి విజేందర్ ఓ నవ్వు నవ్వి వూరుకున్నాడు. విజేందర్ మాట్లాడుతూ... అతనికి ఎలా సమాధానమివ్వాలో తనకు తెలుసన్నాడు.

ఇలాంటి బెదిరింపులకు నేను నవ్వి వూరుకుంటానని, ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ అతనికి ఉందని, నేను మాత్రం రింగ్‌లోనే సమాధానమిస్తానని, అదీ అతడికి బాగా అర్థమయ్యే భాషలో ఇస్తానన్నాడు. హ్యుసెనోవ్ ప్రొఫెషనల్‌గా అనుభవం ఉండొచ్చనని, కానీ తానేమి తక్కువ కాదన్నాడు.
తాను ఒలింపిక్స్ పతక విజేతనని చెప్పాడు. కాగా, ప్రొఫెషనల్ బాక్సర్లు అయిన విజేందర్ సింగ్, హ్యుసెనోవ్‌లు ఈ నెల 19న జరిగే బౌట్‌లో తలపడనున్నారు. విజేందర్ తన తొలి రెండు ప్రొఫెషనల్ బౌట్లలో ప్రత్యర్థుల్ని నాకౌట్ చేశాడు. హ్యుసెనోవ్ చాలా అనుభవం కలిగినవాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications