
హైదరాబాద్: జర్మనీ రేసర్ సెబాస్టియన్ వెటెల్ మరో గ్రాండ్ ప్రి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. స్పా- ఫ్రాంకోర్‌ఛాంప్స్ వేదికగా జరిగిన బెల్జియం గ్రాండ్ ప్రిలో విజేతగా ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ నిలిచాడు. ఆదివారం జరిగిన బెల్జియం గ్రాండ్ ప్రి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
పోల్ పొజిషన్‌తో రేసును ప్రారంభించిన హామిల్టన్‌ను వెటెల్ తొలి ల్యాపులోనే అధిగమించాడు. అక్కడి నుంచి రేసు ముగిసేదాకా ఆధిక్యంలో కొనసాగిన వెటెల్ 44 ల్యాపుల ఈ రేసును గంటా 23 నిమిషాల 34.476 సెకన్లలో పూర్తి చేశాడు. రికార్డు స్థాయిలో ఈ రేసును ఐదోసారి పోల్ పొజిషన్‌తో ప్రారంభించిన హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానంలో నిలిచాడు.
వెటెల్‌తో పోలిస్తే హామిల్టన్ 11.061 సెకన్లు ఆలస్యమయ్యాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్, ఓకాన్‌లు వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో నిలిచారు. ప్రధాన రేసు మొదలైన కాసేపటికే రేసింగ్ కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదానికి కారణమైన హుల్కెన్‌బర్గ్‌పై ఫార్ములావన్ నిర్వాహకులు 10 స్థానాలు పెనాల్టీగా విధించారు.