
హైదరాబాద్: వియన్నా వేదికగా ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రియా గ్రాండ్ ప్రిలో మెర్సిడెస్ డ్రైవర్ వాల్తెరి బొటాస్ ఈ సీజన్‌లో తొలి పోల్ పొజిషన్ సంపాదించాడు. శనివారం జరిగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో బొటాస్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 03.130 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు.
దీంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును అతను మొట్టమొదటి స్థానం నుంచి ప్రారంభించనున్నాడు. మరోవైపు క్వాలిఫయింగ్ సెషన్‌లో గ్రిడ్ పెనాల్టీని ఎదుర్కొన్న సెబాస్టియన్ వెటల్ ఆరో స్ధానంలో నిలిచాడు. దీంతో ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటల్ మూడో స్థానం నుంచి రేసును మొదలు పెట్టనున్నాడు.
ఈ ఛాంపియన్ షిప్ రేసులో లూయిస్ హామిల్టన్‌తో పోలిస్తే వెటల్ 14 పాయింట్ల వెనుకంజలో ఉన్నాడు. ఇక, మెర్సిడెస్ జట్టుకే చెందిన హామిల్టన్ రెండో స్థానం నుంచి రేసుని కొనసాగించనున్నాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా 11వ, 17వ స్థానాల నుంచి రేసును ప్రారంభిస్తారు.