న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి 15వ తేదీన జరగనున్న ప్రపంచ కప్‌లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కామెంటేటర్‌గా అవతారం ఎత్తనున్న విషయం తెలిసిందే. దీనిపై బిగ్ బీ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. అడిలైడ్‌లో పాక్ - భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా.. తొలిసారి కామెంటేటర్‌గా చేయబోతున్నందున ఉత్కంఠగా, భయంగా ఉందని చెప్పారు.
పాకిస్తాన్ - భారత్ దేశాల మధ్య మ్యాచ్ అంటేనే ఎమోషన్స్ ఉంటాయని చెప్పారు. ఈ రెండు దేశాల్లో క్రికెట్, సినిమాల ఎమోషన్స్ కనిపిస్తాయన్నారు. తన వరకైతే తొలిసారి ఇలాంటి రెండు దేశాల మధ్య కామెంటర్‌గా చేయడం ఎక్సైటింగ్‌గా ఉందన్నారు. తన తాజా చిత్రం ఫిబ్రవరి 6వ తేదీన విడుదలవుతుందని ఈ సందర్భంగా తెలిపారు.

కాగా, భారత్, పాకిస్తాన్ మధ్య జరగనున్న ప్రపంచ కప్‌కు అమితాబ్ బచ్చన్ హాజరవుతున్నారు. ఆయన కామెంటేటర్‌గా అవతారం ఎత్తనున్నారు. ఫిబ్రవరి 15వ తేదీన భారత్, పాక్ దేశాల మధ్య ఆసక్తికరమైన పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు అన్నీ అమ్ముడుపోయాయి.
ప్రపంచవ్యాప్తంగా ఈ ఆటను దాదాపు వంద కోట్ల మంది చూస్తారని అంచనా కూడా ఉంది. ఇప్పుడు ఈ మ్యాచ్‌కు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మరో ప్రత్యేక ఆకర్షణ కానున్నారు.
ఈ మ్యాచ్‌కు అమితాబ్ బచ్చన్ కామెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. 1983 ప్రపంచ కప్ సారథి అయిన కపిల్ దేవ్, మరో కామెంటేటర్ హర్షా బోగ్లేతో కలిసి కామెంటరీ బాక్సులో అమితాబ్ సందడి చేయనున్నారు. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా కామెంటరీ బాక్స్‌లో ఉంటారు.