Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోచ్ లు వెంకటపతి రాజు, వివేక్ జయసింహలకు ఉద్వాసన

Venkatapathi raju
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ వెంకటపతి రాజు, కోచ్ వివేక్ జయసింహలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సిఎ) ఉద్వాసన పలికింది. శనివారం హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఉప్పల్ స్టేడియంలో జరిగిన హెచ్ సిఎ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కోచ్ లను కాపాడేందుకు హెచ్ సిఎ ప్రయత్నిస్తోందనే విమర్శలు వచ్చాయి. కోచ్ ల వ్యవహారశైలిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరకాటంలో పడిన హెచ్ సిఎ వారి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, అప్పటికే వారు రాజీనామాలు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.

రంజీ ట్రోఫీలో హైదరాబాద్ క్రికెట్ జట్టు రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో కేవలం 21 పరుగులు మాత్రమే చేయడం, రెండో ఇన్నింగ్స్ లో 126 పరుగులు చేసి ఇన్నింగ్స్ 256 పరుగుల తేడాతో ఓడిపోవడం వల్ల కోచ్ ల వ్యవహార శైలిపై, హెచ్ సిఎ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. హెచ్ సిఎ నుంచి, హైదరాబాద్ క్రికెట్ జట్టు నుంచి తెలంగాణేతరులను తప్పించాలని, తెలంగాణేతర కోచ్ లను కూడా తప్పించాలని మరో వైపు తెలంగాణ క్రికెట్ జెఎసి డిమాండ్ చేస్తూ వస్తోంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+