Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బిసిసిఐ చీఫ్ సెలెక్టర్ గా వెంగీ రాజీనామా


ముంబయి: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) చీఫ్ సెలెక్టర్ పదవికి వెంగ్ సర్కార్ రాజీనామా చేశారు. బిసిసిఐ యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని బిసిసిఐ ధృవీకరించడం లేదు. పాకిస్తాన్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో మూడో టెస్టుకు జట్టును ఫోన్ ద్వారా ఎంపిక చేయాలని బిసిసిఐ చేసిన సూచన వెంగ్ సర్కార్ ను తీవ్రంగా కలత పెట్టింది.ఇంతటి అవమానం తనకు జీవితంలో ఎన్నడూ జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు.

బిసిసిఐకి, వెంగ్ సర్కార్ కు మధ్య గత కొంత కాలంగా వివాదం కొనసాగుతోంది. పత్రికలకు వెంగ్ సర్కార్ కాలమ్స్ రాయడాన్ని బిసిసిఐ తీవ్రంగా తప్పు పట్టింది. పత్రికలకు కాలమ్స్ రాయకూడదని బిసిసిఐ వెంగ్ సర్కార్ ను ఆదేశించింది. బిసిసిఐ ఆదేశాలకు ముందు ఆయన ఎదురు తిరిగారు. ఆ తర్వాత బిసిసిఐ ఆదేశాలకు తలొగ్గి పత్రికలకు కాలమ్స్ రాయబోనని చెప్పారు. దాంతో వివాదం సద్దుమణిగినట్లు అనిపించింది. అయితే తాజాగా మూడో టెస్టుకు జట్టు ఎంపిక విషయంలో బిసిసిఐ వ్యవహరించిన తీరు వెంగ్ సర్కార్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందనడంలో సందేహం లేదు.
Story first published: Sunday, December 2, 2007, 23:53 [IST]
Other articles published on Dec 2, 2007
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+