'వైశాలి.. ఐ యామ్ సారీ..' - ప్రజ్ఞానంద ఎదురు ఫ్లవర్స్,చాక్లెట్ ఇచ్చి మరీ..
టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్.వైశాలితో కరచాలనం చేసే విషయంలో .. ఉజ్బెకిస్థాన్ గ్రాండ్ మాస్టర్ నోడిర్‌బెక్ యాకుబ్బోయేవ్ వ్యవహరించిన తీరు వివాదస్పదమైన సంగతి తెలిసిందే. తాజాగా అతడు ఆమెకు క్షమాపణలు తెలిపాడు. వైశాలికి ఫ్లవర్స్, చాక్లెట్ల్ ఇచ్చి మరీ, ఆమె సోదరుడు ఆర్. ప్రజ్ఞానంద ఎదురుగా క్షమాపణలు తెలిపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసలేం జరిగిందంటే
రీసెంట్ గా టాటా స్టీల్ చెస్ టోర్నీలో వైశాలి, యాకుబ్బోయేవ్ నాలుగో రౌండ్ లో పాల్గొన్నారు. సాధారణంగా మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఆనవాయితీ. దీంతో వైశాలి ఎప్పటిలాగే తన చేయిని ముందుకు చాచి కరచాలనం చేయబోయింది. అయితే ఆమెతో చేయి కలిపేందుకు నిరాకరించిన యాకుబ్బోయేవ్.. ఆమెను పట్టించుకోకుండా పావులు కదపడంలో బిజీ అయిపోయాడు. దీంతో వైశాలి.. తన చేయిని వెనక్కి తీసుకుంది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఉజ్బెకిస్థాన్ ఆటగాడి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వీడియో వైరల్ అయిన వెంటనే అతడు స్పందించాడు. తనకు ఆటగాళ్లంటే గౌరవముందని చెప్పిన అతడు.. షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు తన మత విశ్వాసాలు అంగీకరించవని తెలిపాడు.
అనంతరం గురువారం ప్రజ్ఞానంద ఎదురుగా వైశాలికి పూలు, చాక్లెట్లు ఇచ్చి మరీ మరోసారి క్షమాపణలు చెప్పాడు. తనను అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపాడు. వైశాలి కూడా అతడి క్షమాపణను అంగీకరిస్తున్నట్టు తెలిపింది. అతడు ఆ రోజు అలా ఎందుకు ప్రవర్తించాడో అర్థం చేసుకున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియోను 'చెస్ బేస్ ఇండియా' సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Uzbek GM Nodirbek Yakubboev met GM R. Vaishali and apologized to her. He did so by brining flowers and chocolate.
— ChessBase India (@ChessbaseIndia) January 30, 2025
Full video: https://t.co/TEm7o4Bn3W pic.twitter.com/vnJV8NBdIj
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications