For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రాక్‌పైన కాదు.. గెలిచాక ఉసెన్ బోల్ట్‌ని కింద పడేశాడు!

By Srinivas

బీజింగ్: రెండు రోజుల క్రితం వంద మీటర్ల పరుగులో స్వర్ణం గెలిచిన జమైకా వీరుడు, గురువారం 200 మీటర్ల పరుగులోను జస్టిన్ గాట్లిన్‌ను వెనక్కి నెట్టి పసిడిని పట్టాడు. ఈ రేసులో బోల్ట్‌ను గాట్లిన్ పడగొడతాడని అందరూ భావించారు. కానీ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో బోల్ట్ తన సత్తాను మరోసారి చాటాడు.

అయితే, ఈ రేసులో బోల్ట్‌ను గాట్లిన్ పడగొడతాడనుకుంటే అది జరగలేదు. కానీ, నిజంగానే బోల్ట్ మాత్రం కిందపడ్డాడు. అయితే, విజయం అనంతరం అభివాదం చేస్తుండగా ఇది జరిగింది. రేసు ముగిశాక... బోల్ట్‌ను ఓ కెమెరామెన్‌ కింద పడేశాడు.

రేసు పూర్తయ్యాక స్టేడియంలో అభిమానులకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్న బోల్ట్‌ను ఒక కెమెరామెన్‌ కదిలే యంత్రం మీద వెంబడించాడు. ఐతే ఆ క్రమంలో అతను అనుకోకుండా పట్టు తప్పి బోల్ట్‌ మీద పడటంతో ఉసేన్‌ కూడా అతనిపై పడిపోయాడు.

Usain Bolt wiped out by cameraman on Segway when celebrating 200m gold

అయితే అదృష్టవశాత్తూ బోల్ట్‌ గాయాలు కాకుండా తప్పించుకున్నాడు. ఈ వీడియో సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో విస్తృతంగా కనిపిస్తోంది. మీడియా ప్రతినిధి బోల్ట్ వెనుకగా ఓ సెగ్ వేపై వస్తూ బోల్ట్‌ను చిత్రీకరిస్తున్నాడు.

ఇంతలో అతడి సెగ్ వే చక్రాలు ఓ మెటల్ రెయిలింగ్‌ను ఢీకొన్నాయి. దాంతో సెగ్ వే అదుపుతప్పవడం, బోల్ట్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ కెమెరామన్‌తో పాటు బోల్ట్ కూడా కిందపడిపోయాడు. స్టేడియం సిబ్బంది వచ్చి బోల్ట్‌కు చేయందించగా, ముఖంపై చిరునవ్వులు పూయిస్తూ పైకి లేచాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+