లండన్‌లో ఆఖరి పరుగుకి సిద్ధమైన ఉసేన్ బోల్ట్
హైదరాబాద్: జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ తన చివరి పరుగుకు సిద్ధమవుతున్నాడు. గత దశాబ్ద కాలంగా స్ప్రింట్ ట్రాక్‌పై సత్తా చాటిన బోల్ట్ త్వరలో విశ్రాంతి తీసుకోబోతున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో 8 బంగారు ఒలింపిక్ పతకాలు, 11 వరల్డ్ ఛాంపియన్‌షిప్ బంగారు పతకాలు సాధించి ఎన్నో ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించాడు.
100, 200 మీటర్ల పరుగులో బోల్ట్ నెలకొల్పిన రికార్డులు అనేకం. ఆగస్టు 4 నుంచి లండన్ వేదికగా మొదలయ్యే ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ సందర్భంగా తన చివరి రేసులో పోటీపడబోతున్నాడు. తన చివరి రేసులోనైనా బోల్ట్‌ను ఓడించే సత్తా ఎవరికైనా ఉంటుందా లేదా చూడాలి మరి.

బోల్ట్‌కు పోటీ ఇచ్చే వారు ఉన్నారా?
ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో అసాఫా పావెల్, యొహాన్ బ్లేక్, జస్టిన్ గాట్లిన్ మాత్రమే బోల్ట్‌కు పోటీ ఇచ్చే వాళ్లుగా కనిపిస్తున్నారు. అయితే పావెల్ ఈ పోటీల్లో పాల్గొనడం లేదు. ఇక బ్లేక్ విషయానికి వస్తే గాయాలతో సతమతమవుతున్నాడు. గాట్లిన్ పరుగులో నిలకడ లేదు.

మంచి ఫామ్‌లో ఉన్న డిగ్రాస్
2016 రియో ఒలింపిక్స్ తర్వాత 100 మీటర్ల పరుగులో అతడు పెద్దగా రాణించలేదు. అయితే ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో బోల్ట్‌కు గట్టి పోటీ ఇవ్వగలడని భావిస్తున్న వాళ్లలో 22 ఏళ్ల ఆండ్రీ డిగ్రాస్(కెనడా) ముందు వరుసలో ఉన్నాడు. డిగ్రాస్ మంచి ఫామ్‌లో ఉన్నాడని బోల్ట్ కూడా ఒక సందర్భంలో చెప్పాడు.

ఒకే ఒలింపిక్స్‌లో మూడు పతకాలు గెలిచిన తొలి కెనడా స్ప్రింటర్
గతేడాది ముగిసిన రియో ఒలింపిక్స్‌లో 100 మీటర్లు, 200 మీటర్లు పరుగులో డిగ్రాస్ బోల్ట్‌కు సమీపంగా పరుగెత్తాడు. ఇక 100 మీటర్ల పరుగులో కాంస్యం గెలిచిన అతడు 200 మీటర్ల పరుగులో రజతం నెగ్గాడు. ఇక 400 మీటర్ల రిలేలో కాంస్యం గెలుపొందాడు. ఇలా ఒకే ఒలింపిక్స్‌లో మూడు పతకాలు గెలిచిన తొలి కెనడా స్ప్రింటర్ డిగ్రాస్ కావడం విశేషం.

200 మీటర్ల పరుగులో పాల్గొనడం లేదన్న బోల్ట్
ఇక, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బోల్ట్ 100 మీటర్ల పరుగుతో పాటు 4×100 మీటర్ల రిలేలో పాల్గొనబోతున్నాడు. ఇటీవల మొనాకోలో జరిగిన డైమండ్ లీగ్ రేసులో 100 మీటర్ల పరుగును 9.95 సెకన్లలో పూర్తి చేసి పసిడి నెగ్గిన బోల్ట్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల పరుగులో పాల్గొనడం లేదని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications