Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందరి కళ్లు బోల్ట్‌పైనే: లండన్‌లో రియో చరిత్ర రిపీట్ అవుతుందా?

హైదరాబాద్: జమైకా పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్ కెరీర్‌లో ఆఖరి పరుగుకి సిద్ధమయ్యాడు. శుక్రవారం ప్రారంభం కానున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిపే బోల్ట్‌కు ఆఖరి రేసు కానుంది. ఈ వరల్డ్ చాంపియన్‌షిప్‌తో రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు బోల్ట్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీంతో అందరి కళ్లు బోల్ట్ పైనే ఉన్నాయి. ఇప్పటికే 8 ఒలింపిక్ స్వర్ణాలు, 11 ప్రపంచ బంగారు పతకాలతో మరే అథ్లెట్‌కు అందనంత ఎత్తులో నిలిచిన ఈ పరుగుల చిరుత ఆఖరి రేసులో కూడా అంతే ఘనంగా ముగించి గ్రాండ్‌గా వీడ్కోలు తీసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు.

ఈ చాంపియన్‌షిప్‌లో ఉసేన్ బోల్ట్ కేవలం రెండు ఈవెంట్లలో మాత్రమే పరుగెత్తనున్నాడు. 100 మీటర్లు, 4*100 మీటర్ల రిలేలో బోల్ట్ పాల్గొంటున్నాడు. ఈసారి 200 మీటర్ల రేసుకు దూరంగా ఉండాలని బోల్ట్ నిర్ణయించుకున్నాడు. దీంతో ఈ రెంటిండిలోనూ బోల్ట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాడు.

Usain Bolt looks for Rio repeat to win gold at London

గతంలో 100 మీటర్ల రేసులో 9.58 సెకన్లతో తాను నెలకొల్పిన ప్రపంచ రికార్డును బోల్ట్ చివరిరేసులో బద్దలు కొడుతాడని ఆశించకపోయినా, మరోసారి అత్యుత్తమ ప్రదర్శనతోనే అలరిస్తాడని క్రీడాభిమానులు భావిస్తున్నారు. తన ఆఖరి పోరాటానికి సిద్ధమవుతున్న వేళ ప్రపంచం మొత్తం అతడినే చూస్తోంది.

బోల్ట్ విన్యాసాలను కనులారా వీక్షించి.. జ్ఞాపకాలను శాశ్వతంగా చేసుకోవాలన్నది ప్రతి అభిమాని ఆశగా ఎదురు చూస్తున్నాడు. శుక్రవారం 100మీ పరుగులో పోటీపడే బోల్ట్‌.. శనివారం ఫైనల్స్‌లో అభిమానులను అలరించనున్నాడు. ఆ తర్వాత 4×100మీటర్ల రిలేలో కూడా బోల్ట్ మెరవనున్నాడు.

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో బోల్ట్ రేసుల షెడ్యూల్:

100 మీటర్ల తొలిరౌండ్ ఆగస్టు 4 (అర్ధరాత్రి 1.15కు)
100 మీటర్ల సెమీస్, ఫైనల్ ఆగస్టు 5 (అర్ధరాత్రి 12 నుంచి)
4X100 మీటర్ల రిలే క్వాలిఫికేషన్ ఆగస్టు 12 (సాయంత్రం 3.25కు)
4X100 మీటర్ల రిలే ఫైనల్ ఆగస్టు 12 (అర్ధరాత్రి 2.20కు)

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+