న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Usain Bolt: బోల్ట్‌కు క‌వ‌లలు.. వైరల్ అయిన చిన్నారుల పేర్లు!!

Usain Bolt announces birth of twin sons, Their Names Take Social Media By Storm

జమైకా: ఆల్ టైమ్ గ్రేట్ స్ప్రింటర్, జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ (34) మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి కేసీ బెన్నెట్‌ కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని 'ఫాదర్స్ డే' రోజున ఫ్యామిలీ ఫోటోతో బోల్ట్‌ సోషల్ మీడియాలో ఆదివారం పంచుకున్నారు. కవలల ఫొటో పంచుకున్న బోల్ట్‌.. వారు ఎప్పుడు జన్మించింది మాత్రం వెల్లడించలేదు. అయితే ఇద్దరు చిన్నారులకు విభిన్నంగా పేర్లు పెట్టడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. సోషల్‌ మీడియాలో ఈ విషయాన్ని వైరల్‌గా మార్చేశారు.

అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం సందర్భంగా ఉసేన్‌ బోల్ట్‌ ఓ ట్వీట్‌ చేశాడు. తన కవల పిల్లల పేర్లేంటో ప్రపంచానికి తెలియజేశాడు. 'ఒలింపియా లైటెనింగ్‌ బోల్ట్‌, సెయింట్‌ లియో బోల్ట్‌, థండర్‌ బోల్ట్‌' అని తన ట్వీట్‌కు వ్యాఖ్య పెట్టాడు. ఆ ముగ్గురి పేర్ల పక్కన మెరుపు చిహ్నాలను ఉంచాడు. బోల్ట్‌కు గతేడాది మే నెలలో అమ్మాయి పుట్టింది. ఆమె పేరు ఒలింపియా లైటెనింగ్‌ బోల్ట్‌. ఈ మధ్యే మగ పిల్లలు పుట్టారు. వారే సెయింట్‌ లియో బోల్ట్‌, థండర్‌ బోల్ట్‌. మెరుపులు, ఉరుములకు చెందిన పేర్లు పెట్టడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు మీమ్స్‌తో అలరించగా.. మరికొందరు అతడికి అభినందనలు తెలియజేశారు.

ఉసేన్‌ బోల్ట్‌ పిల్లల పేర్లపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. 'లైటనింగ్‌ (మెరుపు), థండర్‌ (ఉరుము)? ఇక ఇక్కడ తుపానే' అంటూ కామెంట్‌ చేశారు. 'ఈ అందమైన కుటుంబానికి ఇక ఆనందం తప్ప మరేమీ ఉండదు' అంటూ మరో నెటిజన్‌ రాసుకొచ్చాడు. బోల్ట్‌ సతీమణి కేసీ బెన్నెట్‌ సైతం 'నా ప్రేమ.. ఉసేన్‌ బోల్ట్‌కు హ్యపీ ఫాదర్స్‌ డే. ఈ కుటుంబంలో నువ్వే ఒక రాక్‌స్టార్‌. మన చిన్నారులకు గొప్ప నాన్నవు. మేమంతా నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాం' అని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.

దాదాపు దశాబ్దం పాటు పురుషుల స్ప్రింట్‌లో తన హవాను చాటిన ఉసేన్‌ బోల్ట్‌ 2017లో రిటైర్‌ అయ్యాడు. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు నెలకొల్పిన బోల్ట్‌.. 2008, 2012, 2016 ఒలింపిక్స్‌ క్రీడల్లో 100, 200 మీటర్లలో పసిడి పతకాలు గెల్చి ఈ ఘనత సాధించిన ఏకైక స్ప్రింటర్‌గా చరిత్ర సృష్టించాడు. 100, 200 మీటర్ల పరుగులో బోల్ట్ నెలకొల్పిన వరల్డ్ రికార్డులు ఇంకా పదిలంగానే ఉన్నాయి. ఓవరాల్‌గా తన అథ్లెటిక్ కెరీర్‌లో 8 ఒలింపిక్ బంగారు పతకాలతో పాటు 11 వరల్డ్ ఛాంపియన్‌షిప్ పతకాలను బోల్ట్ సాధించాడు.

2017లో లండన్ వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెట్ ఛాంపియన్‌షిప్‌ అనంతరం జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ అథ్లెటిక్స్ నుంచి రిటైరయ్యాడు. బోల్ట్‌ చివరిసారిగా ప్రపంచ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల స్ప్రింట్‌ విభాగంలో పోటీపడ్డాడు. అయితే తన కెరీర్‌ చివరి రేసులో మాత్రం అతడు చిన్నబోయాడు. ఎవ్వరూ ఊహించని విధంగా మూడో స్థానంలో నిలిచాడు.

Story first published: Monday, June 21, 2021, 19:53 [IST]
Other articles published on Jun 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X