న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూడు సార్లు సైక్లింగ్ వరల్డ్ ఛాంపియన్ కెల్లీ కాట్లిన్ ఆత్మహత్య

USAs Kelly Catlin, three-time cycling world champion, dies aged 23

హైదరాబాద్: రియో ఒలింపిక్‌ పతక విజేత, మూడు సార్లు సైక్లింగ్ వరల్డ్ ఛాంపియన్ అయిన అమెరికాకు చెందిన యువ సైక్లిస్ట్ కెల్లీ కాట్లిన్ (23) ఆత్మహత్య చేసుకొంది. ఆమె మరణవార్తను యుఎస్ఏ సైక్లింగ్ అధికారికంగా ధ్రువీకరించింది. 2016-18 మధ్య కాలంలో మూడుసార్లు వరల్డ్‌ సైక్లింగ్‌ చాంపియన్‌షిప్ నెగ్గిన అమెరికా జట్టులో కెల్లీ సభ్యురాలుగా ఉన్నారు.

వరల్డ్‌కప్‌‌లో ధోని అవసరం ఎంత ఉందో అర్థం చేసుకోవాలి: వార్న్వరల్డ్‌కప్‌‌లో ధోని అవసరం ఎంత ఉందో అర్థం చేసుకోవాలి: వార్న్

2016 ఒలింపిక్స్‌లో టీమ్ విభాగంలో కాట్లిన్ కాంస్య పతకం సాధించారు. 2017, 18లో జరిగిన వరల్డ్ ట్రాక్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాలను గెలుచుకున్నారు. ఫిబ్రవరిలో పోలెండ్‌లో జరిగిన వరల్డ్‌ చాంపియన్‌షిఫ్‌ను దక్కించుకోవడంలో అమెరికా జట్టు విఫలమైంది. దీంతో జాతీయ జట్టు నుంచి కెల్లీ స్వచ్ఛందంగా తప్పుకుంది.

USAs Kelly Catlin, three-time cycling world champion, dies aged 23

కెల్లీ మృతికి కారణాలు బయటికి తెలియలేదు గానీ ఆమె ఆత్మహత్య చేసుకునే ముందు ఈ-మెయిల్‌లో తండ్రి మార్క్‌కి ఫేస్‌బుక్‌ ద్వారా సోదరుడు కాలిన్‌కు సూసైడ్‌ నోట్‌ పంపించిందని పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా ఆమె తలకు తగిలిన గాయంతో తలనొప్పితో బాధపడుతుంది.

దీనికి తోడు విపరీతమైన మానసిక ఒత్తిడిలో ఉన్న కెల్లీ జనవరిలో ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించిందని ఆమె సోదరి తెలిపింది. కెల్లీ కాట్లిన్ ఆత్మహత్యపై యుఎస్ఏ సైక్లింగ్ ప్రెసిడెంట్ రాబ్ డీమార్టిని తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Story first published: Wednesday, March 13, 2019, 12:58 [IST]
Other articles published on Mar 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X