Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైల్డ్ ఫైర్ - స్టార్ అథ్లెట్ కు తప్పిన ప్రమాదం - 10 ఒలింపిక్ మెడల్స్ మంటల్లో బుగ్గి

ఒలింపిక్స్‌... ఈ ప్రతిష్టాత్మక విశ్వక్రీడల్లో ఆడాలనేది ప్రతి ఒక్క అథ్లెట్ జీవిత కల. కేవలం ఆడటం మాత్రమే ఇందులో పతకం సాధించడం వారి జీవితం లక్ష్యం. అయితే ఇది అంత సులువుగా వచ్చేది కాదన్న సంగతి తెలిసిందే. ఈ విశ్వ క్రీడల్లో మెడల్ ను ముద్దాడి పోడియంపై నిలబడాలంటే, ఎంతో తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఇది ప్రతి అథ్లెట్ కు ఓ జీవితకాల అనుభవం.

మరి అలాంటిది ఈ ప్రతిష్టాత్మక ఒలింపిక్‌లో ఏకంగా 10 మెడల్స్ ను సాధించాలంటే ఎంతగా కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జీవితంలో ఎన్నో త్యాగాలు కూడా చేయాల్సి ఉంటుంది. మరి అంత కష్టపడి వాటిని సాధించాక, చివరకు అవి కాలి బూడిదైతే... ఆ అథ్లెట్‌ బాధ వర్ణణాతీతం.

US swimmer Gary Hall Jr says he lost 10 Olympic medals in Palisades wildfire

ఇప్పుడు అమెరికాకు చెందిన మాజీ స్విమ్మర్‌ గ్యారీ హాల్‌ జూనియర్‌ కూడా ఇలాంటి బాధనే గుండెలో మోస్తున్నాడు. ఆ పతకాలు లేకుండా తాను జీవించలేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

అసలేం జరిగిందంటే
లాస్‌ ఏంజెలెస్‌ను కార్చిచ్చు కమ్మేసింది. ఈ మంటల్లో గ్యారీ హాల్‌ జూనియర్‌ ఇల్లు కూడా కాలిపోయింది. అదృష్టవశాత్తు మంటలను గమనించిన అతడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అయితే అతడు సాధించిన 10 ఒలింపిక్, 6 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ మెడల్స్ ఆ మంటల్లో కాలిపోయాయి. ''పతకాలు కాలిపోయాయా? అని అందరూ అడుగుతున్నారు. అవును, అన్నీ కాలి బూడిదైపోయాయి. అవి లేకుండా బ్రతకలేను. అన్నీ కాలిపోయాయి.

మళ్లీ కష్టపడి మొదలుపెట్టాలా? ఏం చేయాలి? నా ఇల్లు ఉండే చోటుకు మళ్లీ ఎప్పుడు వెళ్తాను? ఒకవేళ వెళ్లినా కూడా ఆ బూడిదలో నా మెడల్స్ కరిగిపోయుంటాయి. నా విలువైనదంటూ ఏమి మిగలలేదు. జీవితం కోసం పరుగెత్తే క్రమంలో ఆ మెడల్స్ తో ఫొటోలు కూడా దిగలేదు. చాలా అత్యంత దారుణమైన ఘటన ఇది. నా కూతురుతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఇంటి వెనుక నుంచి దట్టమైన పొగ వచ్చింది. ఇళ్లన్నీ మంటల్లో కాలిపోతూ బూడిద అయిపోవడం చూశాను. దీంతో వెంటనే ప్రాణాలు కాపాడుకోవడం కోసం నా కుక్కను, కొన్ని వస్తువులను తీసుకుని పరుగెత్తాను'' అని 50 ఏళ్ల గ్యారీ తన బాధను వ్యక్తం చేశాడు.

Story first published: Saturday, January 11, 2025, 10:11 [IST]
Other articles published on Jan 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+