Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కంటతడి: ఆన్‌లైన్‌లో యాంకర్ నగ్నవీడియో హల్‌చల్

న్యూయార్క్: తన నగ్న వీడియోని ఆన్‌లైన్‌లో పెట్టినందుకు గాను ఓ హోటల్‌పై 75 మిలియన్ డాలర్ల (రూ. 511 కోట్ల)కు పరువు నష్టం దావా వేసింది అమెరికా స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్ ఎరిన్ ఆండ్రూస్. వివరాల్లోకి వెళితే.... 2008లో వాండర్‌బిల్ట్‌ ఫుట్‌బాల్ టోర్నీని విశేషాలను కవర్ చేసేందుకు స్పోర్ట్స్ యాంకర్ అయిన ఎరిన్ అమెరికాలోని వాండర్‌బిల్ట్ యూనివర్సిటీ సమీపంలో ఉన్న మారియట్‌ నేష్‌విల్లే హోటల్‌‌లో బస చేసింది.

ఈ సమయంలో ఆమె గది పక్కనే హోటల్‌లో బస చేసిన మైఖేల్ డేవిడ్ బారెట్‌ అనే వ్యక్తి ఆమె రూమ్‌కు రంధ్రం చేసి.. ఆమె దుస్తులు మారుస్తుండగా వీడియో తీసి, దానిని ఇంటర్నెట్‌లో పెట్టాడు. ఆ వీడియోని ప్రపంచ వ్యాప్తంగా 17 మిలియన్ల చూశారు.

దీంతో తన ప్రమేయం లేకుండా తన నగ్న వీడియోని తీసి ఇంటర్నెట్‌లో పెట్టేందుకు సహకరించిన మారియట్ నేష్‌విల్లే హోటల్‌పై ఆమె పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు నిమితంత్ ఆమె సోమవారం కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి తన వాంగ్మూలాన్ని కోర్టు జ్యూరీకి నివేదించింది.

US sports broadcaster Erin Andrews tells of shock after nude video posted

ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందనే విషయం దర్యాప్తు చేయడానికి ముందే, తానే స్వయంగా ఈ వీడియో తీసి.. పబ్లిసిటీ కోసం ఇంటర్నెట్‌లో పెట్టానని దినపత్రికలు రాశాయని ఆమె కోర్టుకు తెలిపింది. అంతేకాదు ఓ వ్యక్తి రహస్యంగా వీడియో తీసి ఇంటర్నెట్‌లో పెట్టాడని తెలిసినప్పుడు తాను దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపింది.

తీవ్ర అవమానంతో కుంగిపోయానని కన్నీటి పర్యంతమవుతూ కోర్టులో తన వాంగ్మూలాన్ని తెలియజేసింది. ఘటన జరిగిన నాటినుంచి తాను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని రోదిస్తూ ఆమె కోర్టుకు తెలిపింది. తన గది పక్కనే రూమ్ కావాలని ఓ వ్యక్తి తమను కోరినట్టు మారియట్ సిబ్బంది తనకు ముందే చెప్పి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని ఆమె తెలిపింది.

అయితే హోటల్ తరఫు లాయర్ మాత్రం ఈ వ్యవహారంలో నేరమంతా నిందితుడు డేవిడ్ బ్యారెట్‌దేనని, హోటల్‌ ప్రమేయం ఏమీ లేదని వాదించారు. గతంలో 'డ్యాన్సింగ్ విత్ స్టార్స్' అనే టెలివిజన్‌ షోలో నటించిన సందర్భంలో ఎరిన్ ఆండ్రూస్ ఈ హోటల్‌పై కేసు నమోదు చేసింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+