For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

US Open 2023: మ్యాచ్ ఓడినా మనసులు గెలిచిన బోపన్న జోడీ.. రన్నరప్‌తో సరి!

పోరాటానికి వయసుతో సంబంధం లేదని నిరూపించిన భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న.. యూఎస్ ఓపెన్‌ పురుషుల డబుల్స్ విభాగంలో తుది మెట్టుపై తడబడ్డాడు. తన సహచరుడు, ఆస్ట్రేలియన్ ప్లేయర్ మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరిన బోపన్న.. ఈ ఘనత సాధించిన అత్యంత పెద్ద వయసు ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అదే జోరులో టైటిల్ నెగ్గిన అత్యంత పెద్ద వయసు ప్లేయర్‌గా మాత్రం రికార్డు సాధించలేకపోయాడు.

డిఫెండింగ్ ఛాంపియన్లు రాజీవ్ రామ్, జో సాలిస్‌బరీ చేతిలో బోపన్న జోడీ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను 2-6తో నెగ్గిన బోపన్న, ఎబ్డెన్.. ఆ తర్వాత అదే ోరు కొనసాగించలేకపోయారు. దీంతో 6-3, 6-4 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయి మ్యాచ్ కోల్పోయారు. ఈ ఓటమితో వీళ్లు రన్నరప్‌లుగా నిలిచారు. 2010 యూఎస్ ఓపెన్ తర్వాత ఇలా ఒక గ్రాండ్ స్లామ్ ఫైనల్ చేరడం బోపన్న కెరీర్‌లో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

US Open 2023:

అప్పుడు కూడా బోపన్న, ఖురేషీ జోడీ రన్నరప్‌లుగానే నిలిచారు. ఇప్పుడు కూడా అదే ఫలితం రిపీట్ అయింది. 43 సంవత్సరాల ఆరు నెలల వయసులో కూడా కుర్రాళ్లతో పోటీ పడుతూ చెలరేగుతున్న బోపన్న.. యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో కూడా క్రీడాస్ఫూర్తి చాటుకున్నాడు. ఈ మ్యాచ్ ఏడో గేమ్ మూడో సెట్‌లో అద్భుతమైన దృశ్యం అందర్నీ కట్టిపడేసింది.

అప్పటికి 2-4తో ఆ గేమ్‌లో బోపన్న, ఎబ్డెన్ జోడీ వెనుకపడి ఉంది. ఇక ఆ సెట్‌లో కూడా 0-15తో వెనుకంజలోనే ఉంది. ఇలాంటి సమయంలో ప్రత్యర్థులు ఇద్దర్నీ కోర్టులో ఒకవైపు తీసుకురావడంలో బోపన్న జోడీ సక్సెస్ అయింది. ఆ వెంటనే ఓపెన్ కోర్ట్‌లోకి ఎబ్డెన్ అద్భుతమైన షాట్ కొట్టడంతో బోపన్న జోడీకి పాయింట్ దక్కింది. కానీ బోపన్న మాత్రం వెంటనే చైర్ అంపైర్ వద్దకు వెళ్లాడు.

ఎబ్డెన్ కొట్టిన షాట్ తన భుజానికి రాసుకుంటూ పోయిందని, కాబట్టి ఆ పాయింట్‌ను ప్రత్యర్థులకే ఇవ్వాలని అడిగాడు. బోపన్న చెప్పే వరకు దాన్ని ఎవరూ గుర్తించకపోవడం గమనార్హం. ఆ తర్వాత రిప్లేలో చూస్తే బంతి బోపన్న భుజాన్ని చాలా లైట్‌గా టచ్ చేసినట్లు కనిపించింది. ఇది చూసిన ప్రేక్షకులు అతని క్రీడాస్ఫూర్తిని తెగ మెచ్చుకున్నారు. ఆ సెట్‌ను బోపన్న జోడీ గెలిచింది. కానీ ఆ తర్వాత తడబడి మ్యాచ్ ఓడింది.

ఇలా బోపన్న భుజానికి బంతి తాకడాన్ని ఆ స్టేడియం మొత్తంలో ఇద్దరే గుర్తించారు. వాళ్లు బోపన్న, ఎబ్డెన్ మాత్రమే. వాళ్లే వెళ్లి పాయింట్‌ను ప్రత్యర్థికి ఇవ్వమనడంతో ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. దీని గురించి మ్యాచ్ అనంతరం మాట్లాడిన బోపన్న.. 'నా కెరీర్ మొత్తం నేను ఇలాగే ఉన్నా. స్కోర్ లైన్ ఏంటి? మ్యాచ్ ఎంత ముఖ్యం? అనేది పాయింట్ కాదు. ఏదైనా కరెక్ట్ కాకపోతే అది తప్పు అంతే' అని తేల్చిచెప్పాడు.

Story first published: Saturday, September 9, 2023, 21:59 [IST]
Other articles published on Sep 9, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+