హ్యూస్ షాక్ నుండి తేరుకోకముందే.. బాల్ తగిలి ఎంపైర్ మృతి
ఇజ్రాయెల్: ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతి మరవకముందే ఇజ్రాయెల్‌లో ఓ అంపైర్ బంతి తగిలి మృతి చెందిన విషాద సంఘటన చోటు చేసుకుంది. అశ్ దోద్ నగరంలో శనివారం ఓ స్థానిక మ్యాచ్‌లో ఈ దుర్ఘటన జరిగింది. బ్యాట్స్‌మన్ కొట్టిన బలమైన షాట్‌కు ఆ బంతి బౌలర్ ఎండ్‌లో నిలబడిన 60 ఏళ్ల అంపైర్ ముఖానికి నేరుగా వచ్చి తగిలింది.
దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని ప్రాణం డెడ్లీ బాల్ తీసింది. చనిపోయిన అంపైర్ పేరు హిలెల్ ఆస్కార్. అతను బంతి తగలగానే అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. దీంతో హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

కానీ, అతను మృతి చెందాడు. బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి వికెట్లకు తగిలి బౌన్స్ అయి, బౌలింగ్ ఎండ్‌లో ఉన్న అంపైర్ ఛాతి పైన బలంగా తాకిందని, దీంతో కిందపడిన ఆ అంపైర్ హార్ట్ ఎటాక్‌కు గురయ్యాడని ఓ ఆటగాడు తెలిపాడు. మృతి చెందిన అంపైర్ ఇజ్రాయెల్ జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications