Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డబుల్ సెంచరీ వీరుడు మార్టిన్ గుప్తిల్ ఎడమ కాలికి రెండు వేళ్లే...!

ఆక్లాండ్: వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో భాగంగా వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించి జట్టును సెమీ ఫైనల్స్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్.

మార్చి 21 (శనివారం) జరిగిన మ్యాచ్‌లో స్టేడియం రూఫ్ పైకి సిక్సర్ కొట్టిన అనంతరం రెండు వేళ్లతో అభివాదం చేయడం క్రికెట్ ప్రేజ్ఞకులందరికీ గుర్తిండే ఉంటుంది. గతంలో న్యూజిలాండ్ మాజీ ఆటగాడు, ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ మెక్‌మిలన్ ఒక్కడే వెస్ట్‌ప్యాక్ స్టేడియంలో రూఫ్ పైకి సిక్సర్ కొట్టాడు.

శనివారం జరిగిన మ్యాచ్‌లో రూఫ్ పైకి సిక్సర్ కొట్టిన రెండో బ్యాట్స్‌మెన్‌ని తానేనంటూ గుర్తుచేస్తూ గుప్తిల్ తన రెండు వేళ్ల సంకేతాన్ని చూపాడు. అయితే క్రికెట్ అభిమానులకు మాత్రం ఈ రెండు వేళ్ల సంకేతం మరోలా కనెక్ట్ అయింది.

మార్టిన్ గుప్తిల్ తన 13వయేట తన ఎడమకాలి మూడ వేళ్లను పొగొట్టుకున్నాడు. ఫోర్క్ లిప్ట్ వాహనం అతని కాలిపై నుంచి వెళ్లడంతో అతను తన మూడు వేళ్లను కోల్పోవాల్సి వచ్చింది. అలాంటి గుప్తిల్ ఎక్కువగా పరుగెత్తే క్రికెట్ అసామాన్య రీతిలో రాణించడం అందిరినీ ఆశ్చర్యపరుస్తోంది.

వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు ఎవరూ సాధించలేని అత్యధిక పరుగులు (237) సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గుప్తిల్ సాధించిన 237 పరుగులు అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో రెండో అత్యధిక స్కోరు. వెస్టిండిస్‌పై గుప్తిల్ సాధించిన డబుల్ సెంచరీతో వెస్టిండిస్‌పై న్యూజిలాండ్ అలవోక విజయాన్ని సాధించింది.

'Two Toes' Guptill: Maimed left foot doesn’t stop NZ star from demolishing Windies

వరల్డ్ కప్‌లో మార్చి 24న దక్షిణాఫ్రికాతో జరగబోయే రెండో సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కూడా ఆక్లాండ్‌లో జరగనుండటం న్యూజిలాండ్‌కు కలిసోచ్చే అంశం. గత ఏడాది కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ 264 పరుగులు చేసి వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడి రికార్డుని నమోదు చేశాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+