రియో ఒలింపిక్స్‌లో కలకలం: కాల్పులు, మహిళ సహా ఇద్దరు మృతి
రియో డి జెనిరో: రియో ఒలింపిక్స్‌లో కలకలం చెలరేగింది. ఒలింపిక్స్ కోసం 85వేల మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసినా అపశృతి దొర్లింది. ఆరంభ వేడుకలు ముగిసిన కొద్ది గంటల్లోనే మరకాన స్టేడియం ముందు ఓ వ్యక్తి తుపాకీ కాల్పుల్లో మృతి చెందగా, మరో ఒలింపిక్ స్టేడియానికి సమీపంలో ఓ మహిళను అగంతకులు కాల్చి చంపేశారు.
సైకిల్ పైన వస్తున్న వ్యక్తి పైన ఎవరో కాల్చడంతో అతను రోడ్డు పైనే కుప్పకూలిపోయాడు. మరో సంఘటనలో 51 ఏళ్ల మహిళ పైన ముగ్గురు దుండగులు దాడి చేశారు. ఈ సంఘటనలతో రియో భద్రత పైన అనుమానాలు కలుగుతున్నాయి. రియోలో క్రైమ్ రేటు ఎక్కువగా ఉంటుంది.
ప్రపంచంలో అత్యంత నేరమయ నగరాల్లో రియో పదకొండో స్థానంలో ఉంది. అక్కడ గత ఏడాది లక్ష జనాభాకు 35 మంది చొప్పున హత్యకు గురయ్యారు. బ్రెజిల్ దేశ రాజధానిలో దారి దోపడీలో 23.7 శాతం, హత్యలు 15.4 శాతం పెరిగాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి.
సైక్లింక్ ట్రాక్ వద్ద భారీ పేలుడు
రియో ఒలింపిక్స్ నిర్వహిస్తున్న సైక్లింగ్ ట్రాక్ వద్ద భారీ పేలుడు శబ్దం కలకలం రేపింది. వెంటనే స్పందించిన బాంబు నిర్వీర్య దళం సంఘటనా స్థలికి చేరుకొని పరిశీలించింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. శబ్దానికి గల కారణాలు తెలియరాలేదు. పేలుడు కారణంగా ఆటగాళ్లు పరుగులు పెట్టారు.

రియో ఒలింపిక్స్
రియో ఒలింపిక్స్‌లో మెన్స్ సైక్లింగ్ రోడ్డు పైన అనుమానాస్పద బ్యాగేజీ కనిపించడంతో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్న దృశ్యం.

రియో ఒలింపిక్స్
రియో ఒలింపిక్స్ నేపథ్యంలో మెన్స్ సైక్లింగ్ రోడ్డుకు దగ్గరలో ఉన్న కోపకాబనా బీచ్‌లో గస్తీ నిర్వహిస్తున్న నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆఫీసర్.

రియో ఒలింపిక్స్
రియో ఒలింపిక్స్ 2016 ప్రారంభం సందర్భంగా ఒలింపిక్ జ్యోతి వెలిగిస్తున్న దృశ్యం. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి.

రియో ఒలింపిక్స్
రియో ఒలింపిక్స్ 2016 ప్రారంభం సందర్భంగా ఒలింపిక్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications