న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ 2016లో ఆర్టిస్టిక్ భారత క్రీడాకారిని దీపా కర్మాకర్ ఫైనల్ చేరుకొని రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై దీప తండ్రి దులాల్ మాట్లాడారు. గత కొన్ని రోజుల నుంచి తాను టెన్షన్ కారణంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని చెప్పారు. ఆదివారం కూడా అలాగే గడిపానన్నారు.
సోమవారం ఉదయం దీప ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ విభాగంలో క్వాలిఫికేషన్‌లో ఫైనల్‌కు అర్హత సాధించడంతో పట్టలేని ఆనందం కలిగిందన్నారు. త్రిపురకి చెందిన 22ఏళ్ల దీప కర్మాకర్ ఆగస్టు 14న జరగనున్న ఫైనల్‌లో పతకం గెలిస్తే అదే తనకు అతి పెద్ద పుట్టిన రోజు బహుమతి అన్నారు.

దీపా కర్మాకర్ ఫైనల్ చేరిన నేపథ్యంలో ట్విట్టర్లో ఆమె పైన ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రముఖులు ఆమెకు కితాబిచ్చారు. హర్షా బోగ్లే, శివరాజ్ సింగ్ చౌహన్, అమితాబ్ బచ్చన్, సోహా అలీకాన్, విజేందర్ సింగ్, పారుపల్లి కశ్యప్, వీవీఎస్ లక్ష్మణ్ తదితరులు ప్రశంసలు కురిపించారు.