For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒలింపిక్స్‌లో ఊహించని సంఘటన: ముద్దాడిన 'గే' (ఫోటోలు)

By Nageshwara Rao
Twitter reacts to Olympian kissing after finishing last

హైదరాబాద్: ప్యాంగ్ చాంగ్ వేదికగా జరుగుతోన్న వింటర్ ఒలింపిక్స్‌లో ఊహించని సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒకే ఒక 'కిస్'‌తో అమెరికాకు చెందిన ప్రీ స్టయిల్ స్కైయెర్ గస్‌ కెన్‌వర్తీ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చాడు. అయితే ఈ కిస్ 'గే' కిస్ కావడం విశేషం.

టోర్నీలో భాగంగా ఆదివారం ఫీనెక్స్ స్నో పార్క్‌లో స్లోప్‌ స్టయిల్‌ ఈవెంట్‌ జరిగింది. అయితే, ఈవెంట్‌లో పాల్గొన్న 12 మంది అథ్లెట్లలో గస్‌ కెన్‌వర్తీనే చివరివాడిగా నిలవడం విశేషం. అయితే, ఈవెంట్‌లో పెద్దగా రాణించని కెన్‌వర్తీ.. అనంతరం తన బాయ్‌ఫ్రెండ్‌ మాథ్యూ విల్కాస్‌కు ముద్దు ఇస్తూ కెమెరాకు చిక్కాడు.

ఆఖరి స్థానంలో వచ్చిన తన 'గే' బాయ్‌ప్రెండ్‌ని అభినందించే క్రమంలో చుట్టూ ఉన్న పరిస్థితిని పట్టించుకోకుండా వీరిద్దరూ ముద్దుల్లో మునిగిపోయారు. ఇంతలో ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కెమెరామెన్‌లు తన కెమెరాల్లో బంధించారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.

దీంతో బ్రిటిష్ సంతతికి చెందిన కెన్‌వర్తీ ఒక్కరాత్రికే ఎల్జీబీటీ కమ్యూనిటీకి హీరో అయ్యాడు. సోమవారం ఈ ఫోటోలపై కెన్‌వర్తీ తన ట్విట్టర్‌లో స్పందించాడు. 'ఈ మూమెంట్‌ను కెమెరాలో బంధిస్తారని అనుకోలేదు. ఈ రకంగా మా గురించి ప్రపంచానికి చెప్పడం చాలా సంతోషంగా ఉంది. నా చిన్నతనంలో ఎప్పుడూ గే కిస్‌ను టీవీల్లో చూడలేదు. ఇదే తొలిసారి కావొచ్చు. ఒక పిల్లాడు ఇంట్లో కూర్చొని మా ప్రేమను చూసే అవకాశం కల్పించారు. లవ్ ఈజ్ లవ్' అని కెన్‌వర్తీ ట్వీట్ చేశాడు.

Story first published: Monday, February 19, 2018, 17:21 [IST]
Other articles published on Feb 19, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+