Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గోల్డ్ విన్నర్ కరోలినా మారిన్‌ కేకలపై నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు

హైదరాబాద్: 'దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా.. ప్రెషర్ కుక్కర్ కన్నా స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారినే ఎక్కువ సౌండ్ చేస్తోంది' ఇది ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత కరోలినా మారిన్‌పై ట్విట్టర్‌లో ఓ నెటిజన్ పోస్టు చేసిన ట్వీట్. ఇదే కాదు ఇంకో అడుగు ముందుకేసి ఇంకో నెటిజన్ 'మీ టీవీని మ్యూట్‌లో పెట్టండి. మారిన్ కేకలు మీకు కిటికి నుంచి వినిపిస్తాయి' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

రియో ఒలింపిక్స్‌లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన మహిళల సింగిల్స్ పైనల్స్ మ్యాచ్‌లో వరల్డ్ నెంబర్ వన్ అయిన మారిన్ అనుభవంతో కూడిన ఆటను ప్రదర్శించిన విజేతగా నిలిచింది. తన ప్రత్యర్ధి పీవీ సింధు హోరాహోరీగా పోరాడినప్పటికీ, మారిన్ అనుభవంతో రెండు, మూడు సెట్లలో ఆధిపత్యాన్ని చాటింది.

ఫైనల్స్‌లో భారత్‌కు చెందిన పీవీ సింధును ఓడించి రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి ఆసియాయేతర మహిళగా రికార్డు సృష్టించింది. 1992 నుంచి ఒలింపిక్స్ బ్మాడ్మింటన్‌లో ఆసియా క్రీడాకారులదే తిరుగులేని ఆధిపత్యం. ఆ ఆధిపత్యానికి కరోలినా చెక్ పెట్టింది.

Twitter has a field day as Marin grunts her way to glory

ఎడమచేతి వాటంతో ఆడే కరోలినా మారిన్ స్వర్ణం గెలిచిన ఆనందంలో గ్రౌండ్‌లో బోర్లాపడి కంటతడి పెట్టింది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఫైనల్స్‌లో మారిన్ ఆటతీరు కన్నా ఆమె చేసిన కేకలు భారతీయులకు బాగా చెవినపడ్డట్టున్నాయి. ఆమె కేకలు, అరుపులపై నెటిజన్లు సెటైరికల్ కామెంట్లు చేస్తున్నారు.

కరోలినా మారిన్ కేకలపై నెటిజన్లు పెట్టిన కొన్ని ఫన్నీ ట్వీట్లు మీకోసం:

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+