Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కామన్వెల్త్: దీప రికార్డు, పతక విజేతలు(పిక్చర్స్)

గ్లాస్గో: భారత జిమ్నాస్ట్‌ దీప కర్మాకర్‌ చరిత్ర సృష్టించింది. మహిళల వాల్ట్‌ విభాగంలో ఆమె కాంస్య పతకం సాధించింది. దీంతో కామన్వెల్త్‌లో పతకం నెగ్గిన తొలి మహిళా జిమ్నాస్ట్‌గా 20 ఏళ్ల దీప రికార్డులకెక్కింది. గురువారం జరిగిన వాల్ట్‌ ఈవెంట్‌ ఫైనల్లో దీప 14.366 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం నెగ్గింది. క్లాడియా (ఇంగ్లండ్‌), ఎస్లాబెత్‌ (కెనడా) వరుసగా స్వర్ణం, రజతం దక్కించుకున్నారు. గత క్రీడల్లో భారత్‌కు తొలి పతకం అందించిన జిమ్నాస్ట్‌గా ఆశిష్ కుమార్ రికార్డు సృష్టించాడు.

ఒలింపిక్‌ పతక విజేత యోగేశ్వర్‌ దత్‌ తన ట్రేడ్‌మార్క్‌ 'ఫిటిలి'తో బౌట్‌ను శాసించాడు. గురువారం జరిగిన రెజ్లింగ్‌ ఫైనల్స్‌ 65 కిలోల విభాగంలో యోగేశ్వర్‌ దత్‌, 55 కిలోల్లో బబితలు పసిడిని పట్టారు. 63 కిలోల విభాగంలో గీతిక రజతంతో, 86 కిలోల్లో పవన్‌ కుమార్‌ కాంస్యంతో రాణించగా, డిస్కస్‌లో వికాస్‌ శివ్‌ గౌడ స్వర్ణంతో మెరిశాడు. ఒలింపిక్‌ పతక విజేత యోగేశ్వర్‌ దత్‌కు ఎదురులేకుండాపోయింది. మొదటి నుంచి ఫైనల్స్‌ వరకు అప్రతిహత జైత్రయాత్రను కొనసాగించాడు. తన ట్రేడ్‌ మార్క్‌ టెక్నిక్‌ 'ఫిటిలి' (కాళ్లను దొరకబుచ్చుకుని పొర్లించడం)తో ప్రత్యర్థులను వణికించాడు. 65 కిలోల ఫ్రీ స్టయిల్‌లో భారత మల్లయోధుడు యోగేశ్వర్‌ 4-0తో జివోన్‌ బల్‌ఫోర్‌ (కెనడా)ను మట్టికరిపించాడు.

పురుషుల 86 కిలోల ఫ్రీస్టైల్‌ విభాగంలో పవన్‌ కుమార్‌ కాంస్యాన్ని గెలుచుకున్నాడు. రెపిచెజ్‌లో పవన్‌ 3-1తో మహమ్మద్‌ ఇనామ్‌ (పాకిస్థాన్‌)పై విజయం సాధించాడు. రెండు రౌండ్ల బౌట్‌లో ఇద్దరూ సమానంగా 6-6తో నిలిచినా.. చివర్లో పాయింట్‌ సాధించినందు వల్ల పవన్‌ను విజయం వరించింది. తగ్జెయేవ్‌ (కెనడా) స్వర్ణం సాధించగా, ఆండ్రూ డిక్‌ రజతం నెగ్గాడు.

దీప కుమార్

దీప కుమార్

భారత జిమ్నాస్ట్‌ దీప కర్మాకర్‌ చరిత్ర సృష్టించింది. మహిళల వాల్ట్‌ విభాగంలో ఆమె కాంస్య పతకం సాధించింది. దీంతో కామన్వెల్త్‌లో పతకం నెగ్గిన తొలి మహిళా జిమ్నాస్ట్‌గా 20 ఏళ్ల దీప రికార్డులకెక్కింది.

దీప కుమార్

దీప కుమార్

గురువారం జరిగిన వాల్ట్‌ ఈవెంట్‌ ఫైనల్లో దీప 14.366 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం నెగ్గింది.

అశీష్ కుమార్

అశీష్ కుమార్

గత క్రీడల్లో భారత్‌కు జిమ్నాస్టిక్స్‌లో తొలి పతకం అందించి రికార్డు సృష్టింన ఆశిష్ కుమార్ మళ్లీ పతకం సాధించేందుకు పోరాడాతున్నారు.

యోగేశ్వర్ దత్

యోగేశ్వర్ దత్

ఒలింపిక్‌ పతక విజేత యోగేశ్వర్‌ దత్‌ తన ట్రేడ్‌మార్క్‌ ‘ఫిటిలి'తో బౌట్‌ను శాసించాడు.

యోగేశ్వర్ దత్

యోగేశ్వర్ దత్

65 కిలోల ఫ్రీ స్టయిల్‌లో భారత మల్లయోధుడు యోగేశ్వర్‌ 4-0తో జివోన్‌ బల్‌ఫోర్‌ (కెనడా)ను మట్టికరిపించాడు. మొదటి రౌండ్‌లో సాంకేతికంగా పదిపాయింట్లు సాధించడంతో యోగేశ్వర్‌ను విజేతగా ప్రకటించారు.

బబిత కుమారి

బబిత కుమారి

బబిత కుమారి మహిళల 55 కిలోల విభాగంలో బబితా కుమారి 3-1తో బ్రిట్టానే లవెర్‌డూర్‌ (కెనడా)ను ఓడించి స్వర్ణం గెలుచుకుంది. బబిత దూకుడు ముందు లవెర్‌డూర్‌ తేలిపోయింది.

వికాస్ శివ్ గౌడ్

వికాస్ శివ్ గౌడ్

డిస్కస్‌ త్రో ఫైనల్స్‌లో వికాస్‌ శివ్‌ గౌడ 63.64 మీటర్లు విసరి పసిడిని పట్టాడు. క్వాలిఫయింగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన వికాస్‌.. ఫైనల్స్‌లోనూ హవా కొనసాగించాడు. మూడో ప్రయత్నంలో విసిరిన 63.64 మీటర్లు స్వర్ణాన్ని సంపాదించి పెట్టింది.

పవన్ కుమార్

పవన్ కుమార్

కామన్వెల్త్ గేమ్స్‌లో 8వ రోజు 86 కిలోల విభాగంలో పవన్‌ కుమార్‌ కాంస్యంతో రాణించాడు.

మహిళల 55 కిలోల విభాగంలో బబితా కుమారి 3-1తో బ్రిట్టానే లవెర్‌డూర్‌ (కెనడా)ను ఓడించి స్వర్ణం గెలుచుకుంది. బబిత దూకుడు ముందు లవెర్‌డూర్‌ తేలిపోయింది. ఆరు నిమిషాలు సాగిన పోరులో సాంకేతిక అంశాల ఆధారంగా బబితను విజేతగా ప్రకటించారు. పోరోగోవస్కా (ఇంగ్లండ్‌), నోయే (నైజీరియా)లు కాంస్య పతకాలను సాధించారు. సెమీస్‌లో బబిత 4-1తో విక్టరీ బై ఫాల్‌ పద్దతిన పోరోగోవస్కాపై విజయం సాధించింది. 63 కిలోల విభాగంలో గీతిక జక్కర్‌ 0-3తో డానియల్లీ లోపెజ్‌ (కెనడా) చేతిలో ఓడి రజతంలో సరిపెట్టుకుంది.

అథ్లెటిక్స్‌లో భారత్‌ తొలి పతకం. అదీ స్వర్ణం. డిస్కస్‌ త్రో ఫైనల్స్‌లో వికాస్‌ శివ్‌ గౌడ 63.64 మీటర్లు విసరి పసిడిని పట్టాడు. క్వాలిఫయింగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన వికాస్‌.. ఫైనల్స్‌లోనూ హవా కొనసాగించాడు. మూడో ప్రయత్నంలో విసిరిన 63.64 మీటర్లు స్వర్ణాన్ని సంపాదించి పెట్టింది. 63.32 మీటర్లు విసరి అపొస్టోలోస్‌ పరెల్లిస్‌ (సైప్రస్‌) రజతాన్ని, 62.34 మీటర్లు విసరి జాసన్‌ మోర్గాన్‌ (జమైకా) కాంస్యాన్ని నెగ్గారు. కాగా, శుక్రవారం జరిగిన బాక్సింగ్ విభాగంలో భారత బాక్సర్ పింకీ కాంస్యంతో సరిపెట్టుకుంది. మహిళల 51 కిలోల విభాగంలో పింకీ జంగ్రా సెమీస్‌లో ఓడి కాంస్యం దక్కించుకుంది.
8వ రోజు పతకాలు:

స్వర్ణం:
యోగేశ్వర్‌ (కుస్తీ)
బబిత (కుస్తీ)
వికాస్‌ గౌడ (డిస్కస్‌)

రజతం:
గీతిక (కుస్తీ)

కాంస్యం:
దీప (జిమ్నాస్టిక్స్‌)
పవన్‌ (కుస్తీ)

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+