ట్రయల్స్‌ను వాయిదా వేయలేం: రెజ్లర్ సుశీల్ కుమార్‌కు షాకిచ్చిన డబ్ల్యూఎఫ్‌ఐ

హైదరాబాద్: రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత, భారత రెజ్లర్ సుశీల్ కుమార్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) షాక్ ఇచ్చింది. తాను గాయంతో బాధపడుతున్న కారణంగా తన 74 కేజీల విభాగంలో నిర్వహించే ట్రయల్స్‌ను వాయిదా వేయాలంటూ కోరాడు. ట్రయల్స్‌ను వాయిదా వేయడం ఎట్టిపరిస్థితుల్లో కుదరదని డబ్ల్యూఎఫ్‌ఐ తేల్చిచెప్పింది.
ఈ ట్రయల్స్‌లో విజేతలుగా నిలిచిన వారు ఈ నెలలో రోమ్ వేదికగా జరిగే ఫస్ట్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నీకి, న్యూఢిల్లీలో ఫిబ్రవరిలో జరిగే ఆసియా చాంపియన్‌షిప్‌కు, మార్చిలో చైనాలోని జియాన్‌లో జరిగే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధిస్తారు. ఈ టోర్నీకి రోజుల వ్యవధిలో సుశీల్ గాయపడటంతో తన విభాగంలో జరిగే ట్రయల్స్‌ను వాయిదా వేయాలని కోరాడు.
డబ్లూఎఫ్‌ఐ వ్యాఖ్యలపై సుశీల్ కుమార్ "రెండు వారాల్లో పూర్తి ఫిట్‌నెస్ సాధించి తిరిగి బరిలోకి దిగుతా. దీనిపై దిగులు చెందాల్సిన పనిలేదు. సాధనలో నా చేతికి గాయమైంది. నేను గాయంతో బాధపడుతున్న విషయం డబ్ల్యూఎఫ్‌ఐకి తెలుసు. ఒక వేళ వారు ట్రయల్స్‌ను కొనసాగించాలనుకుంటే కొనసాగించుకోవచ్చు" అని అన్నాడు.
అయితే సుశీల్ కంటే మెరుగైన రెజ్లర్ లేరని డబ్ల్యూఎఫ్‌ఐ భావిస్తే అతడికి ఆసియా క్వాలిఫయిర్‌కు అవకాశం ఇస్తామని డబ్ల్యూఎఫ్‌ఐ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications