Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ నిర్ణయం తీవ్రమైంది: పాంటింగ్

Ricky Ponting

సిడ్నీ: తదుపరి సిరీస్ ను బహిష్కరించాలని భారత్ నిర్ణయం తీసుకోవడం తీవ్రమైందని, హర్బజన్ సింగ్ పై విధించిన నిషేధంపై అపీల్ పెండింగులో ఉండగా ఆ విధమైన నిర్ణయం తీసుకోవడం తీవ్రమైన చర్య అని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నారు. వారికి ఏది తగిందని అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకునే హక్కు వారికి ఉందని, అయితే వారి నిర్ణయం కాస్తా తీవ్రమైందని అనిపిస్తోందని ఆయన నైన్ నెట్ వర్క్ ఎ కరెంట్ అఫైర్ కార్యక్రమంలో అన్నారు.

ఇంతవరకు జరిగిన రెండు టెస్టులను తాను, తన జట్టు ఆటగాళ్లు చాలా ఆనందించారని ఆయన చెప్పుకున్నారు. సుదీర్ఘ కాలంగా చేసిన గొప్ప పనులు ఇప్పటి చిన్న సంఘటన ద్వారా తుడిచిపెట్టుక పోవని ఆయన అన్నారు. వన్ సైడ్ మాత్రమై నిజమైన స్పూర్తితో ఆడిందనే కుంబ్లే మాటలు తనకు అసంతృప్తిని కలిగించాయని ఆయన అన్నారు. హర్బజన్ ఆగ్రహాన్ని ప్రస్తావిస్తూ ఒక సంఘటన మాత్రమే జరిగిందని, దాంతో ఆస్ట్రేలియాకు సంబంధం లేదని ఆయన అన్నారు. ఆట తనకూ, కుంబ్లే కన్నా పెద్దదని ఆయన వ్యాఖ్యానించారు.
Story first published: Monday, January 7, 2008, 15:32 [IST]
Other articles published on Jan 7, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+