
టోక్యో పారాలింపిక్స్‌లో భారత విజయయాత్ర కొనసాగుతోంది. ఆదివారం ఉదయం రజత పతకంతో ప్రారంభమైన భారత పతకాల వేట సోమవారం రోజున కూడా కొనసాగింది. సోమవారం రోజున 10 మీటర్ల షూటింగ్‌లో అవని లేఖరా స్వర్ణ పతకం సాధించిన కాసేపటికే... మరో అథ్లెట్ యోగేష్ కాతునియా డిస్కస్ త్రోలో రజత పతకం సాధించి భారత్ సత్తాను చాటాడు.
డిస్కస్ త్రో (F6) ఈవెంట్‌లో యోగేష్ కాతునియా 44.38 మీటర్లు డిస్కస్‌ను విసిరి సిల్వర్ మెడల్ సాధించాడు. అయితే బ్రెజిల్‌కు చెందిన ప్రపంచ రికార్డు హోల్డర్ బాతిస్తా డాస్ శాంటోస్ క్లాడినీ 45.9 మీటర్లు మేరా డిస్కస్ విసిరి స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే బరిలోకి దిగిన యోగేష్ ఫౌల్ త్రోతో ప్రారంభించాడు. అయినప్పటికీ 42.84 మీటర్లు డిస్కస్‌ను విసిరాడు. ఆ తర్వాత 43.55 మీటర్లు డిస్కస్‌ను విసిరి ఫర్వాలేదనిపించాడు. అయితే ఇక చివరి త్రో సందర్భంగా తన శక్తినంత కూడగట్టుకుని 44.3 మీట్లు విసిరిశాడు. దీంతో రజతం సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు పారాలింపిక్స్‌లో భారత ప్రదర్శన బాగానే ఉందని క్రీడా మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు భారత్ 5 పతకాలను తన ఖాతాలో వేసుకుంది.
ఇక ఆదివారం రోజున దేశమంతా జాతీయ క్రీడాదినోత్సవం జరుపుకుంటున్న వేళ.. టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు పతకాల పంటను పండించారు. త్రివర్ణ జెండాను సగర్వంగా ఎగురవేశారు. ముందుగా భవీనాబెన్ పటేల్ టేబుల్ టెన్నిస్‌లో సిల్వర్ మెడల్ సాధించింది. ఆ తర్వాత హైజంప్‌లో నిషద్ కుమార్ సిల్వర్ మెడల్ సాధించాడు. అనంతరం వినోద్ కుమార్ డిస్కస్ త్రోలో కాంస్య పతకం సాధించాడు. మొత్తానికి పారాలింపిక్స్‌లో భారత ప్రదర్శన అద్భుతంగా ఉందంటూ దేశం యావత్తు కొనియాడుతోంది.
పారాలింపిక్స్ 2020 బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో భారత షట్లర్ ప్రమోద్ భగత్ గోల్డ్ మెడల్ సాదించాడు. గ్రేట్ బ్రిటన్‌కు చెందిన డేనియల్ బెతెల్‌ను 21-14, 21-17 తేడాతో రెండు వరుస సెట్లలో ఓడించి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ 2020లో పతకాలు గెలిచిన షూటర్లు మనీశ్ నర్వాల్, సింగరాజ్ అధానాకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. మనీశ్‌కు ఆరు కోట్లు, అధానాకు నాలుగు కోట్ల రివార్డును ఇవ్వనున్నట్లు హర్యానా గవర్నమెంట్ వెల్లడించింది.
పారాలింపిక్స్ 2020లో భారత షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే అవనీ లేఖరా ఒక స్వర్ణం, ఒక కాంస్యం కైవసం చేసుకొన్న విషయం తెలిసిందే. ఈ రోజు మనీశ్ నర్వాల్ బంగారు పతకం ముద్దాడగా.. సింఘ్‌రాజ్ అదానా రజతం గెలుచుకున్నాడు.
పారాలింపిక్స్ 2020లో భారత షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే అవనీ లేఖరా ఒక స్వర్ణం, ఒక కాంస్యం కైవసం చేసుకొన్న విషయం తెలిసిందే. ఈ రోజు మనీశ్ నర్వాల్ బంగారు పతకం ముద్దాడగా.. సింఘ్‌రాజ్ అదానా రజతం గెలుచుకున్నాడు.
టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. ప్రపంచ నంబర్‌వన్ ప్రమోద్ భగత్ బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు.
టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. ప్రపంచ నంబర్‌వన్ ప్రమోద్ భగత్ బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు.
పారాలింపిక్స్‌లో షూటర్ అవని లెఖారా మరో పతకం గెలిచింది. ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ గెలిచి అవని.. ఈరోజు 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్‌లో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. దాంతో ఒకే పారాలింపిక్స్‌లో రెండు మెడల్స్ గెలిచిన తొలి ఇండియన్‌గా అవని నిలవడం విశేషం.
జపాన్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ 2020లో భారత ఆటగాళ్లు సత్తాచాటుకున్నారు. హై జంప్‌లో ప్రవీణ్ కుమార్‌కు రజతం సాదించాడు. దీంతో భారత్ ఖాతాలో 11వ మెడల్ చేరింది.