భారత క్వార్టర్ ఫైనల్స్ ఆశలు సజీవంగా నిలిపిన ఒకే ఒక్క గోల్

టోక్యో: జపాన్ వేదికగా సాగుతోన్న ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ 2021 ఎనిమిదో రోజుకు చేరుకుంది..భారత్‌కు అదృష్టం కలిసి వచ్చింది. మహిళల బాక్సింగ్ వెల్టర్‌‌వెయిట్ విభాగంలో భారత బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్ పతకాన్ని ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో చైనీస్ తైపేకు చెందిన తన ప్రత్యర్థిని ఓడించడం ద్వారా ఆమె సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లారు. రజత పతకాన్ని అందుకోనున్నారు. అదే సమయంలో భారత మహిళా హాకీ జట్టు కూడా అద్భుతంగా రాణించింది.. తన సత్తాను చాటింది. క్వార్టర్ ఫైనల్స్‌కు చేరే అవకాశాలను సజీవంగా నిలుపుకొంది.

మహిళల హాకీ విభాగంలో భారత్ తన తదుపరి రౌండ్‌ గ్రూప్ దశ మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడింది. భారత కాలమానం ప్రకారం.. ఈ ఉదయం 8:15 నిమిషాలకు ఆరంభమైన ఈ మ్యాచ్ కొద్దిసేపటి కిందటే ముగిసింది. ప్రారంభం నుంచి రసవత్తరంగా సాగింది. గోల్స్ కోసం రెండు జట్లు సివంగుల్లా పోరాడాయి. ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని సాధించాయి. గోల్స్ కోసం పదేపదే దాడులు చేసినా.. రెండు దేశాల కీపర్లు అడ్డుగోడను కట్టేయడంతో ఒక్కటీ నమోదు కాలేదు. తొలి మూడు క్వార్టర్ల వరకు కూడా అటు ఐర్లాండ్ గానీ, ఇటు భారత్ గానీ ఒక్క గోల్‌ను కూడా చేయలేకపోయాయి.

ఐర్లాండ్ ఆడిన కొన్ని అద్భుతమైన షాట్లను భారత గోల్ కీపర్ సవిత.. అంతే అద్భుతంగా అడ్డుకున్న సందర్భాలు కనిపించాయి ఈ మ్యాచ్‌లో. అటు ఐర్లాండ్ కూడా భారత దాడులను తిప్పి కొడుతూ సమవుజ్జీగా నిలిచింది. భారత ఆటగాళ్ల చుట్టూ బలమైన గోడను కట్టేశారు ఐర్లాండ్ ఆటగాళ్లు. భారత్‌ను అడ్డుకోవడానికి ముందుగా రూపొందించుకున్న ప్లాన్‌ను పక్కాగా ఎగ్జిక్యూట్ చేయగలిగారు. ఫలితంగా మూడు క్వార్టర్ల వరకూ ఏ ఒక్క జట్టు కూడా గోల్ సాధించలేకపోయింది. భారత్ చేసిన ప్రతి అటాక్‌నూ అడ్డుకోవడంలో ఐరిష్ గోల్ కీపర్ సక్సెస్ అయ్యారు. దీనితో మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఈ అంచనాలను తలకిందులు చేశారు భారత ప్లేయర్లు. నాలుగో క్వార్టర్‌లో విజృంభించారు. దుకుడును కొనసాగించారు. తమ చుట్టూ ఐర్లాండ్ కట్టిన గోడను ఛేదించారు. ఆట ముగుస్తుందనుకున్న దశలో 43వ నిమిషంలో గోల్ చేశారు. నవనీత్ కౌర్ ఈ గోల్‌ కొట్టారు. కళ్లు చెదిరేలా బుల్లెట్ వేగంతో దూసుకొచ్చిన బంతిని నిలువరించడంలో ఐరిష్ గోల్ కీపరం విఫలం అయ్యారు. ఆ బంతి కాస్తా నెట్స్‌ను తాకింది. దీనితో రాణి రామ్‌పాల్ సారథ్యంలోని భారత ప్లేయర్ల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌ను గెలవడం ద్వారా భారత మహిళా హాకీ జట్టు.. తన క్వార్టర్ ఫైనల్స్ ఆశలను సజీవంగా నిలుపుకోగలిగింది.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, July 30, 2021, 11:46 [IST]
Other articles published on Jul 30, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X