For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo olympics:తొలి రౌండ్‌లో ఆ అక్క చెల్లెల్లతో తలపడనున్న సానియా జోడీ: గట్టెక్కుతారా

Tokyo Olympics:Sania and Ankita pair to face Ukraniana sisters in their opening match

ఒలింపిక్స్‌ జాతర మరికొన్ని గంటల్లో ప్రారంభం అవుతుంది. ఇప్పటికే ప్రపంచ దేశాల జట్లు ఒలింపిక్ విలేజ్‌కు చేరుకున్నాయి. టోక్యోలో చాలా లో ప్రొఫైల్‌గా ప్రారంభం కానున్న వేడుకలకు పలువురు దేశాధినేతలు కూడా హాజరుకానున్నారు. ఇక్ ఇప్పటికే 1000లోపు మాత్రమే ప్రారంభ వేడుకలకు హాజరవుతారని ఒలింపింక్స్ నిర్వాహకులు చెప్పారు. భారత్ నుంచి ప్రారంభ వేడుకలకు 28 మంది క్రీడాకారులు హాజరు అవుతున్నారు. ఇక ఈ సారి ఈవెంట్స్‌లో భారత జట్టు మెడల్ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. టెన్నిస్ విషయానికొస్తే సానియా మీర్జా మరియు అంకిత జోడీ కాస్త బలంగా కనిపిస్తోంది.

టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా మహిళా టెన్నిస్ డబుల్స్‌లో భారత్‌ నుంచి బరిలోకి దిగుతున్నారు సానియా మీర్జా మరియు అంకిత. వీరు తొలి రౌండ్‌లో ఉక్రెయిన్‌ జోడీ నదియా కిచెనోక్, లుడ్మిలా కిచెనోక్ జోడీని ఢీకొంటారు. అయితే నదియా బలబలాలు సామర్థ్యం ఏమిటో సానియా మీర్జాకు ఒక అవగాహన ఉంది. ఎందుకంటే సానియా మీర్జా తాను బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తొలిసారిగా గతేడాది హోబర్ట్ ఓపెన్‌లో నదియాతో జతకట్టింది. దీంతో నదియా సామర్థ్యం ఏంటో సానియాకు తెలిసే ఉంటుంది. అలానే నదియాకు కూడా సానియా స్ట్రెంత్ ఏంటో తెలుసు. కాబట్టి ఈ మ్యాచ్‌ రసవత్తరంగా సాగే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం 34 ఏళ్ల వయసున్న సానియాకు ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఇది నాల్గవసారి. అంతేకాదు ఒలింపిక్స్‌లో భారత్ నుంచి అత్యధిక సార్లు ప్రాతినిథ్యం వహించిన మహిళా క్రీడాకారిణిగా సానియా మీర్జా రికార్డు క్రియేట్ చేసింది. గతంలో బీజింగ్, లండన్, రియో ఒలింపిక్స్‌లో భారత్ తరపున ప్రాతినిథ్యం వహించింది. ఆ సమయంలో బీజింగ్‌లో సునీతారావ్‌తో జతకట్టగా లండన్‌లో రష్మీ చక్రవర్తి, రియోలో ప్రార్థనా తాంబేర్‌లతో జతకట్టింది.

ఇదిలా ఉంటే భారత టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ ఉజ్బెకిస్తాన్‌కు చెందిన డెనిస్ ఇస్టోమిన్‌తో తలపడనున్నాడు.గతవారం చాలామంది టెన్నిస్ ప్లేయర్లు పోటీల నుంచి తప్పుకోగా... వారి స్థానంలో నాగల్‌కు అవకాశం వచ్చింది. అయితే ఒలింపిక్స్‌లో అడుగుపెట్టనున్న నాగల్ ఈ సీజన్‌లో ఆడిన మ్యాచ్‌లలో తొలిరౌండ్‌లోనే వెనుదిరిగాడు. ఇప్పటి వరకు మూడుసార్లు మాత్రమే క్వార్టర్ ఫైనల్స్‌ వరకు చేరుకున్నాడు. ఈ ఏడాది 137వ ర్యాంకుతో ప్రారంభించిన సుమిత్ నాగల్.. ప్రస్తుతం 160వ స్థానంలో కొనసాగుతున్నాడు.

Story first published: Thursday, July 22, 2021, 15:09 [IST]
Other articles published on Jul 22, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+