న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo Olympics: అథ్లెట్లకు 1.6 లక్షల కండోమ్‌లు.. కానీ!!

Tokyo Olympics organizers distribute 1.6 lakhs free condoms to athletes

టోక్యో: ఒలింపిక్స్‌ కోసం వచ్చే అథ్లెట్లకు నిర్వాహకులు కండోమ్‌లు అందజేయడం షరామామూలే. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ ఇలా జరిగింది. సురక్షిత శృంగారం పట్ల అవగాహన పెంచడానికి, పోటీల ఒత్తిడి నుంచి బయట పడేందుకు శృంగారంలో పాల్గొనమని ప్రోత్సహించే దిశగా ఇలా చేస్తుంటారు. అయితే ప్రస్తుత కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితుల్లో ఒలింపిక్స్‌ను నిర్వహించబోతున్న టోక్యో నిర్వాహకులు.. ఇలాంటి ఆలోచన ఏమీ చేయరనే అంతా అనుకున్నారంతా. కానీ ఈసారి కూడా అథ్లెట్లకు నిర్వాహకుల నుంచి కండోమ్‌లు అందబోతున్నాయి.

<strong>WTC Final: పరిస్థితులు ఎలాగున్నా.. అత్యధిక పరుగులు, వికెట్లు తీసేది వారే! బుమ్రా ఉన్నా.. షమీనే నం.1!</strong>WTC Final: పరిస్థితులు ఎలాగున్నా.. అత్యధిక పరుగులు, వికెట్లు తీసేది వారే! బుమ్రా ఉన్నా.. షమీనే నం.1!

ఒలింపిక్స్‌ కోసం వచ్చే ఒక్కో అథ్లెట్‌కు 14 చొప్పున.. టోక్యో ఒలింపిక్‌ క్రీడా గ్రామంలో మొత్తంగా 1.6 లక్షల కండోమ్‌లను పంచబోతున్నారట. కాకపోతే తమ నగరంలో వాటిని క్రీడాకారులు ఉపయోగించొద్దని, వాటిని జ్ఞాపికలుగా ఇంటికి తీసుకెళ్లాలని నిర్వాహకులు అంటున్నారు. అయితే అథ్లెట్లు టోక్యో నిర్వాహకులు చెప్పినట్టు కండోమ్‌లు దాచుకుంటారో లేదో మరి. ఇక వచ్చే నెల 23 నుంచి టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభం కానున్నాయి. ఏ ఒక్కరు కూడా వైరస్ బారిన పడకుండా.. నిర్వాహకులు కఠిన చర్చలు తీసుకుంటున్నారు.

టోక్యో ఒలింపిక్స్‌ సమీపిస్తుండడంతో దేశంలోనూ విశ్వక్రీడల జోష్‌ నింపేందుకు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌), భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) ఐక్య కార్యచరణ రూపొందించింది. వచ్చే నెల 23 నుంచి ప్రారంభమవనున్న ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత క్రీడాకారులను ఉత్తేజపరచడంతో పాటు ప్రజలకు విశ్వక్రీడల గురించి తెలియజేసేందుకు సాయ్‌, ఐఓఏ కలిసి వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేశాయి. ఒలింపిక్స్‌ క్విజ్‌, వ్యాసరచన, డిబేట్‌ పోటీలు, ఉత్తమ నినాదం, డిజిటల్‌ పోస్టర్‌, ఒలింపిక్స్‌ సాంగ్‌ రూపకల్పన పోటీలు వంటివి దేశవ్యాప్తంగా నిర్వహించాలని రాష్ట్ర ఒలింపిక్‌ సంఘాలకు సూచించాయి. సోషల్‌ మీడియాలో కూడా ఒలింపిక్స్‌పై జోరుగా ప్రచారం చేయాలని.. దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సంఘాలను సాయ్‌, ఐఓఏ ఆదేశించాయి.

Story first published: Wednesday, June 9, 2021, 10:40 [IST]
Other articles published on Jun 9, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X