మా విద్యార్థులు దేశానికే గర్వకారణం: నీరజ్ చోప్రా - పునియాలకు క్యాష్ ప్రైజ్ ప్రకటించిన యూనివర్శిటీ..!!

టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశానికి బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా పై పలు సంస్థలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. జావెలిన్ త్రోలో నీరజ్ స్వర్ణపతకం సాధించిన వెంటనే, చాలామంది అతనికి కోట్ల రూపాయల్లో రివార్డు ప్రకటించారు. ఆనంద్ మహీంద్రా అతనికి ఒక SUV ఇస్తామని ప్రకటించగా, BCCI కూడా అతనికి 1 కోటి నజరానా ప్రకటించింది. ఇప్పుడు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) కూడా నీరజ్ మీద కనక వర్షం కురిపించింది.
కీరా నారాయణన్ : IPL యాంకర్ హాట్ ఫోటోలు

నీరజ్ చోప్రా-భజరంగ్ పునియాలకు సత్కారం
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU)లో చదివిన విద్యార్థులు మరియు ఒలింపిక్ పతక విజేతలు నీరజ్ చోప్రా మరియు భజరంగ్ పునియాను సత్కరించేందుకు నిర్ణయించుకుంది. అథ్లెటిక్స్‌లో ఒలింపిక్స్ స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయుడిగా చోప్రా చరిత్ర సృష్టించారు, కుస్తీలో పునియా కాంస్య పతకం సాధించారు.

నీరజ్-పునియాలకు క్యాష్ ప్రైజ్
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీలో బీఏ చదువుతున్న నీరజ్ చోప్రాకు రూ.50 లక్షలు నగదు బహుమతిని, అదే సమయంలో ఎంఏ చదువుతున్న పునియాకు రూ.10 లక్షలు నగదు బహుమతి ఇవ్వనుంది. టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ 2020లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రా.. భారత్ వందేళ్ల కలను సాకారం చేశాడు. ఇక ఒలింపిక్స్‌లో పతకం సాధించే సంప్రదాయాన్ని పునియా కొనసాగించాడు. రెజ్లింగ్‌లో పునియా కాంస్య పతకం సాధించాడు.

నీరజ్ స్వర్ణం-పునియా కాంస్యం
నీరజ్ చోప్రా జావెలెన్ త్రోలో 87.58 మీటర్లు విసిరి బంగారు పతకం సాధించాడు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అథ్లెటిక్స్‌లో భారతదేశానికి ఒలింపిక్ పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన షూటర్ అభినవ్ బింద్రా తర్వాత ఒలింపిక్స్‌లో వ్యక్తిగత ఈవెంట్‌లో బంగారు పతకం సాధించిన రెండో భారతీయుడిగా చోప్రా రికార్డుల్లోకి ఎక్కాడు.
మరోవైపు, పునియా తన సెమీ ఫైనల్ బౌట్‌లో ఓడిపోయినప్పటికీ, కాంస్య పతకం మ్యాచ్‌లో కజకిస్తాన్‌కు చెందిన దౌలత్ నియాజ్‌బెకోవ్‌ను మట్టికరిపించాడు. కజక్ రెజ్లర్‌పై 8-0తో విజయం సాధించాడు. ఇక తప్పకుండా ఒక పతకంతో భారత్‌కు తిరిగి వస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు.

ఇద్దరూ దేశానికి గర్వకారణం
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఛాన్సలర్ అశోక్ మిట్టల్ ఒక ప్రకటనలో ఇలా అన్నాడు. "ఒలింపిక్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లో భారతదేశపు మొదటి స్వర్ణ పతకం సాధించడం ద్వారా నీరజ్ మొత్తం దేశం గర్వపడేలా చేశాడు. స్వర్ణం సాధించాలన్న వందేళ్ల భారత్ కలను సాకారం చేశాడు నీరజ్ చోప్రా. భారత్‌లో ఉన్న అథ్లెట్లకు సరైన శిక్షణ ఉంటే తాము అత్యుత్తమమైన ప్రదర్శన ఇచ్చే సత్తా ఉంది. ఇది మన అథ్లెట్లు నిరూపించారు. ఇక మన క్రీడాకారులు సాధించిన విజయాలతో దేశంలో యువక్రీడాకారులు ప్రేరణగా తీసుకుని క్రీడల్లో రాణించాలి. దేశంలో క్రీడా విప్లవం రావాలి. ఇద్దరూ తమ యూనివర్శిటీ విద్యార్థులు అయినందుకు చాలా గర్వంగా ఉంది. వారిని క్యాంపస్‌కు ఆహ్వానించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం" అని వైస్‌ఛాన్సెలర్ అన్నారు.
మొత్తానికి భారత్ తరపున టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులకు వరుసగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, పలు సంస్థలు నగదు బహుమానాలు ఇస్తున్నాయి. ఇప్పటికే పీవీ సింధూకు ఏపీ ప్రభుత్వం రూ.30 లక్షలు నగదు రివార్డును అందించింది. నీరజ్ చోప్రాకు హరియాణా ప్రభుత్వం రూ.6 కోట్లు నజరానా ప్రకటించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications