టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత రెజ్లర్ బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు పడింది. జాతీయ జట్టు ఎంపిక ట్రయల్స్‌లో డోపింగ్ పరీక్ష కోసం నమూనాను సమర్పించడానికి నిరాకరించినందుకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) నాలుగేళ్ల పాటు సస్పెండ్ చేసింది. ఇదే నేరానికి సంబంధించి NADA ప్రారంభంలో ఏప్రిల్ 23న బజరంగ్ పునియాను తాత్కాలికంగా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నిషేధం నాలుగేళ్ల పాటు ఉంటుందని ప్రకటించింది.
సస్పెన్షన్ వేటు ఏప్రిల్ 23, 2024లో నుంచి నాలుగేళ్ల పాటు అమలులో ఉంటుందని పేర్కొంది. బజరంగ్ పునియా తనపై సస్పెన్షన్ వేటు వేయడంపై యాంటీ-డిసిప్లినరీ డోపింగ్ ప్యానెల్ (ADDP)లో వెళ్లాడు. దీంతో మే 31న యాంటీ-డిసిప్లినరీ డోపింగ్ ప్యానెల్ అధికారక నోటీసులు వచ్చే సస్పెన్షన్ ను తాత్కాలికంగా ఎత్తివేసింది. ఏడీడీపీ ప్యానల్ సెప్టెంబరు 20, అక్టోబరు 4న భజరంగ్ ఇష్యూపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బజరంగ్ పునియా డోపింగ్ నిబంధలు ఉల్లంఘించినట్లు ఏడీడీపీ గుర్తించింది. ఆర్టికల్ 10.3.1 ప్రకారం ఆంక్షలకు భజరంగ్ అతనిపై సస్పెన్షన్ వేటును కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.

దీంతో నాడా తాత్కాలికంగా ఎత్తివేసిన నిషేధాన్ని పునరుద్ధరించింది. ఆర్టికల్ 10.3.1 ప్రకారం అథ్లెట్ బాధ్యుడని 4 సంవత్సరాల కాలానికి అనర్హతకు బాధ్యత వహిస్తాడని ప్యానెల్ పేర్కొంది. నోటిఫికేషన్ వచ్చిన నుంచి అంటే 23.04.2024 నుంచి 4 సంవత్సరాల కాలానికి అథ్లెట్ అనర్హత వేటు కొనసాగుతోందని ప్యానెల్ వివరించింది. బజరంగ్ పునియా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్నారు.
అందుకే డోపింగ్ నియంత్రణకు సంబంధించి తనకు అన్యాయం జరిగిందని బజరంగ్ ఆరోపించాడు. నమూనాలను అందించడానికి తాను ఎప్పుడూ నిరాకరించలేదని చెప్పాడు. డిసెంబర్ 2023లో తన నమూనాల కోసం పంపిన గడువు ముగిసిన టెస్టింగ్ కిట్‌ల వాడకంపై తన ఆందోళనలకు సంబంధించి NADA వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కాగా నాడా తన చర్యలను సమర్థించుకుంది. విశ్లేషణ కోసం మూత్ర నమూనాను అందించాల్సిన అవసరం ఉందని స్పష్ట చేసింది. గడువు ముగిసిన కిట్‌లకు సంబంధించి నాడా నుంచి తగిన స్పందనలు అందిన తర్వాత, ఒక నమూనాను అందించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని బజరంగ్ పేర్కొన్నాడు.