For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo Olympics 2021: అంచనాలు తారుమారు.. వందో ర్యాంక్‌ కుర్రాడికి గోల్డ్ మెడల్!!

Tokyo Olympics 2021: Tunisia swimmer Ahmed Hafnaoui wins gold medal in mens 400 freestyle

టోక్యో: ఒక్కోసారి ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి. క్రీడా రంగంలో ఇది ఎప్పటికి జరుగుతుంటుంది. కచ్చితంగా గెలుస్తారనుకున్న వాళ్లు ఓడిపోవచ్చు.. అసలు అంచనాలు లేనివారు గెలవచ్చు. సరిగ్గా ఇదే జరిగింది టోక్యో ఒలింపిక్స్‌లో. ఏమాత్రం అంచనాలు లేని తునీషియాకు చెందిన అహ్మద్‌ అయూబ్‌ హఫ్నాయ్‌ ఒలింపిక్స్‌లో ఏకంగా గోల్డ్ మెడల్ పట్టాడు. దీంతో ఈసారి గోల్డ్ కొడదామనుకున్న ఆస్ట్రేలియా స్విమ్మర్‌ జాక్‌ మెక్లౌగ్లిన్‌కు నిరాశే ఎదురైంది. ఈసారి విశ్వ క్రీడల్లో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి మెక్లౌగ్లిన్‌.. రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

 అప్పుడు 100వ స్థానం:

అప్పుడు 100వ స్థానం:

400 మీటర్ల ఫ్రీ స్టైల్‌ స్విమ్మింగ్‌లో 2019లో విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో తునీషియాకు చెందిన అహ్మద్‌ అయూబ్‌ హఫ్నాయ్‌ది 100వ స్థానం. గతంలో పాల్గొన్న యూత్‌ ఒలింపిక్స్‌లో 8వ స్థానం. ఇక ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌కు అతడు అర్హత కూడా సాధించలేదు. కానీ టోక్యో ఒలింపిక్స్‌ 2021లో అదరగొట్టాడు. ఒలింపిక్స్‌లో మొదటి సారి పాల్గొన్నా.. ఆ భయం, బిడియం ఏమాత్రం అతనిలో కనపడలేదు. రాకెట్ వేగంతో దూసుకుపోయి అంతర్జాతీయ పతకాల పట్టికను స్వర్ణంతో మొదలుపెట్టాడు అహ్మద్‌ అయూబ్‌. విశ్లేషకుల అంచనాలను తారుమారు చేసి హీరో అయ్యాడు.

తొలిసారే గోల్డ్:

తొలిసారే గోల్డ్:

టోక్యోలో ఆదివారం జరిగిన 400 మీటర్ల స్విమ్మింగ్‌ పోటీలో అహ్మద్‌ అయూబ్‌ హఫ్నాయ్‌ స్వర్ణ పతకం గెలుపొందాడు. క్వాలిఫైయింగ్‌ రౌండ్‌లో ఆకట్టుకోలేకపోయిన హఫ్నాయ్‌.. ఫైనల్లో మాత్రం విజృంభించాడు. కేవలం 3:43.36 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకొన్నాడు. హాట్‌ ఫేవరెట్‌, ఆస్ట్రేలియా స్విమ్మర్‌ జాక్‌ మెక్లౌగ్లిన్‌ ద్వితీయ స్థానంలో నిలిచాడు. జాక్‌ తొలి 200 మీటర్ల వరకు ఆధిపత్యం చూపించినా.. చివర్లో హఫ్నాయ్‌ పుంజుకొని లక్ష్యాన్ని చేరుకొన్నాడు. ఇక అమెరికా స్విమ్మర్‌ కైరాన్‌ స్మిత్‌కు కాంస్య పతకం లభించింది.

Tokyo Olympics 2020: Domino’s Announces Special Gift For Mirabai Chanu | Oneindia Telugu
 కల సాకారమైంది:

కల సాకారమైంది:

'నన్ను నేను నమ్మలేకపోతున్నాను. నా కల సాకారమైంది. నా జీవితంలో ఇదే అత్యుత్తమ రేసు. నీటిలో నిన్నటి కంటే ఈరోజు చాలా మెరుగ్గా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. గోల్డ్ గెలుస్తాననుకోలేదు. ఆ దేవుడికి కృతజ్ఞతలు. నాకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు' అని అహ్మద్‌ అయూబ్‌ హాఫ్నాయ్‌ తెలిపాడు. హఫ్నాయ్‌ తండ్రి తునీషియా బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారుడు. అందుకే 18 ఏళ్ల హఫ్నాయ్‌ చిన్నపటినుంచే క్రీడలపై మక్కువ పెంచుకున్నాడు. ఇక ఒలింపిక్స్‌ చరిత్రలో తునీషియాకు లభించిన ఐదో స్వర్ణ పతకం ఇది. తునీషియాకు స్విమ్మంగ్‌లో లభించిన మూడో స్వర్ణం.

Story first published: Sunday, July 25, 2021, 15:31 [IST]
Other articles published on Jul 25, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+