For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మేక మార్కు: చెప్పుకోవడానికి చీప్‌గానే ఉన్నా: ఆ అమెరికన్ బ్యూటీ జిమ్నాస్ట్‌ కోసం స్పెషల్ డిజైన్

 Tokyo Olympics 2021: Simone Biles first Olympian to have her own emoji as goat by twitter

టోక్యో: అమెరికన్ ఆర్టిస్టిక్ జిమ్నాస్ట్ సైమన్ బిల్స్.. ఓ అరుదైన ఘనతను సాధించారు. టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ఆ యంగ్ అండ్ డైనమిక్ జిమ్నాస్ట్ కోసం ప్రత్యేకంగా ఓ ఎమోజీని రూపొందించింది. ఆ ఎమోజీ.. మేక మార్కు. మేకను సింబల్‌గా తీసుకుని ఈ ఎమోజీని డిజైన్ చేసింది. G.O.A.T (Greatest of All Time)గా సైమన్ బిల్స్‌ను ప్రశంసించింది. ఆమె కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ మేక మార్కు ఎమోజీని ఆవిష్కరించింది. హ్యాష్ ట్యాగ్, మేక మార్కు‌తో కూడిన ఓ జిఫ్‌ను విడుదల చేసింది ట్విట్టర్.

#SimoneBiles లేదా #Simone అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్‌లో టైప్ చేయగానే మేక మార్కు ప్రత్యక్షమౌతుంది. దీనిపట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తోన్నారు. సైమన్ టాలెంట్‌ను గుర్తించడం పట్ల థ్యాంక్స్ చెబుతున్నారు. ఒక ఒలింపియన్ కోసం ట్విట్టర్ ఎమోజీని డిజైన్ చేయడం ఇదే తొలిసారి. ఇదివరకు ఎన్ఎఫ్ఎల్ ప్లేయర్లు టామ్ బ్రాడీ, ప్యాట్రిక్ మాహోమ్స్ ఈ అరుదైన ఘనతను సాధించారు. 2016లో రియో డి జనేరియోలో జరిగిన ఒలింపిక్స్‌లో సైమన్ అదరగొట్టారు. నాలుగు బంగారు పతకాలను ఆమె గెలుచుకున్నారు.

టోక్యో ఒలింపిక్స్‌లో జిమ్నాస్టిక్స్ ఈవెంట్ ఇంకా ఆరంభం కావాల్సి ఉంది. అంతకుముందే- సైమన్ బిల్స్.. సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోన్నారు. సైమన్ బిల్స్ ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటోన్నారు. ఒలింపిక్స్‌లో ఎంట్రీ ఇస్తూనే క్రీడా ప్రపంచాన్ని తన వైపు తిప్పుకొన్న 24 సంవత్సరాల సైమన్ బిల్స్.. టోక్యోలోనూ అద్భుతాలను సృష్టిస్తుందని ఆశిస్తున్నారు. ఇది ఆమె బాధ్యతలను మరింత పెంచిందని, టోక్యో ఒలింపిక్స్ ఈవెంట్ ముగిసే సమయానికి ఆమె స్టార్ హోదాతో వెలిగిపోతారని అంటున్నారు.

Story first published: Friday, July 23, 2021, 22:44 [IST]
Other articles published on Jul 23, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+