For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జయహో భారత్: టోక్యో ఒలింపిక్స్‌లో తొలి పతకం: కరణం మల్లీశ్వరికి వారసురాలొచ్చేసింది

 Tokyo Olympics 2021: Mirabai Chanu gives India 1st medal, bags silver in weightlifting
Tokyo Olympics 2021: Mirabai Chanu Won Silver| India's First Medal | #Tokyo2020 | Oneindia Telugu

టోక్యో: అంగరంగ వైభవంగా ఆరంభమైన విశ్వ క్రీడా వేదిక ఒలింపిక్స్‌లో భారత్ తన జయ కేతనాన్ని ఎగురవేసింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పతకాన్ని అందుకుంది. మహిళా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజత పతకాన్ని అందుకున్నారు. 49 కేజీలో ఈ విభాగంలో ఆమె రెండో స్థానంలో నిలిచారు. మొత్తంగా 202 కిలోల బరువును ఎత్తి అవతల పారేశారామె. ఈ కేటగిరీలో చైనా బంగారు పతకాన్ని అందుకుంది. భారత్ రెండో స్థానంలో నిలిచింది. దేశం మొత్తం గర్వపడేలా చేశారామె. ఈ టోక్యో ఒలింపిక్స్‌లోనే మరిన్ని పతకాలను గెలుచుకోవడానికి స్ఫూర్తినిచ్చారామె.

కరణం మల్లీశ్వరి రికార్డ్..

రెండో రోజే ఈ ఘనతను సాధించడంతో మిగిలిన ఆటగాళ్లు, అథ్లెట్లలో పతకాన్ని సాధించాలనే కాంక్షను రగిలించినట్టయింది. ఇదివరకు తెలుగు తేజం కరణం మల్లీశ్వరి ఇదే వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు ఆ కొరతను తీర్చారు మీరాబాయి చాను. 49 కేజీల మహిళల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చైనాకు చెందిన జిహు హౌ బంగారు పతకాన్ని సాధించారు. ఇండోనేషియాకు చెందిన క్యాంటిక్ విండీ ఐషా మూడో స్థానంలో నిలిచారు. కాంస్య పతకాన్ని అందుకున్నారు.

202 కేజీలతో

మీరాబాయి చాను.. స్నాచ్ కేటగిరీలో 84 కేజీలు, 87 కేజీల బరువును ఎత్తారు. చైనా వెయిట్ లిఫ్టర్ 88, 92, 94 కిలోల బరువును ఎత్తారు. అప్పటికే చానురెండో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఆమెకు రజత పతకం ఖాయమైంది. 89 కేజీలను లిఫ్ట్ చేయడంలో విఫలం అయ్యారు. అదే సమయంలో చైనాకు చెందిన జిహు హౌ 94 కేజీలను లిఫ్ట్ చేయడంతో ఆమెకు స్వర్ణం ఖాయమైంది. ఈ ఈవెంట్‌తో చైనా వెయిట్ లిఫ్టర్ ఒలింపిక్స్ రికార్డ్‌ను నెలకొల్పారు. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో మీరాబాయి 110, 115 కేజీలను లిఫ్ట్ చేశారు. 117 కేజీల బరువును ఎత్తలేకపోయారు. జిహు 116 కిలోలను ఎత్తడంతో ఆధిక్యత ఆమె వైపు మొగ్గింది.

సోషల్ మీడియా షేక్..

మొత్తగా చైనా వెయిట్ లిఫ్టర్ 210 కేజీలు, మీరాబాయి చాను 202, ఇండోనేషియా లిఫ్టర్ 194 కేజీల బరువును ఎత్తారు. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించగానే చానును ఆకాశానికెత్తేశారు సెలెబ్రిటీలు. మాజీ ఒలింపియన్లు, క్రికెటర్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ల చేశారు. మీరాబాయి ఫొటోలు, గ్రీటింగ్స్, రికార్డులతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. కేంద్ర ప్రభుత్వం ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ రివార్డులను ప్రకటిస్తోన్నాయి.

Story first published: Saturday, July 24, 2021, 12:56 [IST]
Other articles published on Jul 24, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+