For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mirabai Chanu: మీరాకు మరో బంపర్ ఆఫర్! అప్పుడు పిజ్జాలు.. ఇప్పుడు మూవీ టికెట్లు!!

Tokyo Olympics 2021: Inox Announces Life Long Free movie Tickets For Mirabai Chanu

మణిపూర్: మీరాబాయి చాను.. ఏ భారత అభిమాని నోటా నోటా విన్నా ఇదే పేరు. ప్రస్తుతం భారత దేశం అంతటా వెయిట్‌లిఫ్ట‌ర్ మీరాబాయి పేరు మార్మోగిపోతోంది. టోక్యో ఒలింపిక్స్‌ 2021లో వెయిట్‌లిఫ్టింగ్‌ 49 కేజీల విభాగంలో రజతం గెలిచిన మీరా.. ఒక్కసారిగా హీరో అయిపోంది. ఒలింపిక్స్‌లో తెలుగు తేజం కరణం మల్లీశ్వరీ తర్వాత మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో పతకం సాధించిన రెండో మహిళగా ఆమె రికార్డు సృష్టించింది. దేశానికి మెడల్ అందించిన మీరాపై ప్ర‌శంస‌ల‌తో పాటు భారీ స్థాయిలో అవార్డులు, రివార్డులు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమెను ఓ బంపర్‌ ఆఫర్‌ వరించింది.

మీరాబాయి చానుకు జీవిత‌కాలం ఫ్రీగా సినిమా టికెట్లు ఇస్తామ‌ని తాజాగా ఐనాక్స్ మ‌ల్టీప్లెక్స్ ప్ర‌క‌టించింది. మీరా ఎన్ని సినిమాలు చూసినా.. అన్నీ ఫ్రీ అంటూ చెప్పింది ఐనాక్స్ లీజ‌ర్ లిమిటెడ్‌. మీరాకే కాదు.. ఒలింపిక్స్‌ 2020లో మెడ‌ల్‌ గెలిచే ప్ర‌తి భార‌త అథ్లెట్‌కు ఇదే ఆఫ‌ర్ ఇస్తామని ఐనాక్స్ స్ప‌ష్టం చేసింది. ఇక ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిన ప్ర‌తి అథ్లెట్‌కు ఏడాది పాటు ఫ్రీగా టికెట్లు ఇస్తామ‌నీ పేర్కొంది. ఈ విష‌యాన్ని త‌న ట్విట‌ర్‌లో ఐనాక్స్ తెలిపింది. దేశంలో ఐనాక్స్‌కు మొత్తం 648 మ‌ల్టీప్లెక్స్‌లు ఉన్నాయి.

డొమినోస్ ఇండియా పిజ్జా వారు కూడా మీరాబాయి చానుకు లైఫ్‌టైం ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. మీరాబాయికి లైఫ్‌టైం ఫ్రీగా పిజ్జాలు ఇస్తామని ప్రకటించింది. 'మెడ‌ల్‌ను గెలిచినందుకు కంగ్రాట్స్‌. వంద కోట్ల‌కు పైగా భార‌తీయుల క‌ల‌ల‌ను సాకారం చేశావు. నీకు జీవిత‌కాలం ఉచితంగా పిజ్జా ఇవ్వ‌డం కంటే సంతోషం మాకు మ‌రొక‌టి ఉండ‌దు' అని డొమినోస్ ఇటీవల ట్వీట్ చేసింది. ఇకపై మీరా తనకు ఇష్టమైన పిజ్జాలను ఎన్నికావాలంటే అన్ని తినొచ్చు. ఐనాక్స్ ఆఫర్ ఇచ్చినా.. సినిమాలు చూసేందుకు ఇప్పుడు ఆమెకు ఫ్రీ టైమ్ దాదాపుగా ఉండదు.

ఇక ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి విశ్వవేదికపై భారతీయ జెండాను రెపరెపాలాడించిన మీరాబాయిపై కానుకల వర్షం కురుస్తోంది. ఇప్పటికే భారత రైల్వేశాఖ రూ.2కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించగా.. ప్ర‌మోష‌న్ కూడా ఇచింది. ఈశాన్య రైల్వేలో ప‌ని చేస్తున్న మీరాను ఇప్పుడు ఆఫీస‌ర్ ఆన్ స్పెష‌ల్ డ్యూటీ (స్పోర్ట్స్‌)గా ప్ర‌మోట్ చేశారు. మరోవైపు మణిపూర్ సర్కార్ కూడా కోటి రూపాయల నగదు ప్రోత్సాహకం ఆమెకు అందించింది.

Story first published: Thursday, July 29, 2021, 14:02 [IST]
Other articles published on Jul 29, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+