
టోక్యో: జపాన్ వేదికగా రసవత్తరంగా సాగుతోన్న ఒలింపిక్స్‌లో భారత్ కీలక ఈవెంట్ల మొదలయ్యాయి. స్టార్ ప్లేయర్ల పలు ఈవెంట్లలో పాల్గొంటోన్నారు. విమెన్ స్టార్ షూటర్ మనుభాకర్, యశశ్విని సింగ్ డెస్వాల్, స్టార్ షట్లర్ పీవీ సింధు, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, అంకితా రైనా, బాక్సింగ్‌లో మేరీకోమ్ పతకాల వేటను ప్రారంభించనున్నారు. హాకీ ఇండియా తన రెండో మ్యాచ్‌ను ఆడబోతోంది. బలమైన ఆస్ట్రేలియా జట్టును ఢీ కొట్టబోతోంది. తన తొలి మ్యాచ్‌లో హాకీ ఇండియా న్యూజిలాండ్‌ను 3-2 గోల్స్ తేడాతో ఓడించింది.
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ర్యాంకింగ్‌లో భారత ప్రస్థానం ముగిసింది. స్టార్ షూటర్లు మనుభాకర్, యశశ్విని సింగ్ డెస్వాల్.. ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించాలంటే తొలి ఎనిమిది మందిలో చోటు దక్కించుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మనుభాకర్, యశశ్విని సాగిస్తోన్న పోరు ముగిసింది. వారిద్దరూ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. విదేశీ షూటర్ల నుంచి తీవ్ర పోటీ ఉండటంతో క్రమంగా వారిద్దరి స్థానం దిగజారుతూ వచ్చింది. ప్రారంభంలో సెకెండ్ సిరీస్‌లో స్థానంలో ఉన్న మనుభాకర్ ఆరో సిరీస్‌కు దిగజారారు.

ఇక్కడా గట్టిపోటీని ఎదుర్కొన్నారు. ఎక్కువ సేపు నిలవలేకపోయారు. ఈవెంట్ ముగిసే సరికి 12వ స్థానంలో నిలిచారు. డెస్వాల్ టాప్ టెన్ నుంచి కిందికి దిగజారారు. 13వ స్థానాన్ని దక్కించుకోగలిగారు. రెండో సిరీస్ ప్రారంభించాల్సి ఉన్న సమయంలో మనుభాకర్ రైఫిల్‌లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. సుమారు అయిదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఆమె ఆటకు దూరమయ్యారు. లోపాన్ని సరిచేసిన తరువాత ట్రాక్‌లో పడ్డారు. సాంకేతిక లోపం తలెత్తడంతో ఆమె తన ఏకాగ్రతను కోల్పోయారనేది స్పష్టమైంది.
మను భాకర్ కంటే ముందు గ్రీక్ షూటర్ అన్నా కొరకాకి, లాత్వియా షూటర్ అగాటె రాస్‌మనె, సెర్బియన్ జొరానా అరునోవిక్, చైనా షూటర్ జియాంగ్ ర్యాన్‌క్జిన్, ఫ్రాన్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న మథిల్డె లామోల్లె, క్యూబా షూటర్ లైనా పెరెజ్ ఉన్నారు. ఫైనల్‌కు చేరాలంటే తొలి ఎనిమిది స్థానాల్లో నిలవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోన్న మను భాకర్.. వారందరినీ అధిగమించడానికి తీవ్రంగా శ్రమిస్తోన్నారు. ఒకదశలో తోటి భారత షూటర్ యశశ్విని కంటే వెనుకంజలో కనిపించిన మను భాకర్ ఆ తరువాత విజృంభించారు. నాలుగు, అయిదు సిరీస్‌లల్లో బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఆరో సిరీస్‌లో గట్టిపోటీని ఎదుర్కొంటోన్నారు. పోటీ తీవ్రంగా ఉండటంతో ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు.