For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo Olympics 2021: ఆర్చ‌రీ మిక్స్‌డ్ ఈవెంట్‌లో ముగిసిన భార‌త్ పోరు!!

Tokyo Olympics 2021: India lose quarters clash to South Korea in Archery Mixed Team event
Tokyo Olympics 2021: Mirabai Chanu Won Silver| India's First Medal | #Tokyo2020 | Oneindia Telugu

టోక్యో : టోక్యో ఒలింపిక్స్‌ 2021 ఆర్చ‌రీ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భార‌త్ పోరు ముగిసింది. క్వార్టర్ ఫైన‌ల్‌లో భార‌త్ భారీ తేడాతో ఓట‌మి పాలైంది. 2-6 తేడాతో ద‌క్షిణ కొరియా చేతిలో భార‌త జోడీ దీపికా కుమారి, ప్ర‌వీణ్ జాద‌వ్ ఓడిపోయారు. అంతకుముందు ప్రీ క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో చైనీస్ తైపీపై 5-3 తేడాతో దీపికా కుమారి, ప్ర‌వీణ్ జాద‌వ్ అద్భుత విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ప్రీ క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో లిన్ చియా ఎన్, తంగ్ చిచ్ చూన్‌ను దీపికా కుమారి, జాద‌వ్ ద్వయం ఓడించారు.

బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్​లో భారత ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్​శెట్టి అదరగొట్టింది. చైనీస్ తైపీ జట్టుపై 21-16, 16-21, 27-25 తేడాతో విజయం సాధించింది. మొదటి సెట్లో అద్భుత విజయాన్ని అందుకున్న భారత జోడి.. రెండో సెట్లో ఓటమిపాలింది. ఇక మూడో సెట్ నువ్వానేనా అన్నట్టు సాగింది. చివరికి 27-25తో సెట్‌తో పాటు మ్యాచును కైవసం చేసుకుంది.

భారత టెన్నిస్​ యువ కెరటం సుమిత్​ నగాల్​ అదరగొట్టాడు. తొలి రౌండ్​లో ఉజ్బెకిస్థాన్​కు చెందిన డెనిస్​ ఇస్తోమిన్​పై 6-4, 6-7, 6-4 తేడాతో గెలిచి రెండో రౌండ్​కు అర్హత సాధించాడు. సుమిత్​ నగాల్ మూడు సెట్లట్లో తన మార్క్ ఆట కనబరిచాడు. తోలి సెట్ గెలిచినా.. రెండో సెట్‌ను తృటిలో కోల్పోయాడు. మూడో సెట్లో సుమిత్​ నగాల్, డెనిస్​ ఇస్తోమిన్ హోరాహోరీగా తలపడ్డారు. చివరకు సుమిత్ అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు .

Story first published: Saturday, July 24, 2021, 12:29 [IST]
Other articles published on Jul 24, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+