For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo Olympics 2021: అదరగొట్టిన హాకీ ఇండియా: హై ఎక్స్‌పెక్టేషన్స్

Tokyo Olympics 2021: India beat New Zealand 3-2 in an intense Pool A match to open campaign

టోక్యో: జపాన్‌లో కొనసాగుతోన్న టోక్యో ఒలింపిక్స్‌‌లో రెండో రోజు భారత్ అదరగొడుతోంది. తొలి రోజు నిరాశ పరిచినప్పటికీ.. రెండో రోజు ఆ పరిస్థితి కనిపించట్లేదు. మిక్స్డ్ అర్చరీ విభాగంలో క్వార్టర్ ఫైనల్‌లో అడుగు పెట్టిన కొద్దిసేపటికే మరో తీపి కబురును వినిపించారు భారత క్రీడాకారులు. హాకీలో దూకుడును ప్రదర్శించారు. అదర గొట్టే ఫలితాన్ని అందుకున్నారు. ఈ మెగా టోర్నమెంట్‌లో భారత హాకీ జట్టు తాను ఎదుర్కొన్న తొలి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకుంది. హాకీ విభాగంలో భారత జట్టు తన దండయాత్రను గెలుపుతో ఆరంభించింది.

తొలి మ్యాచ్‌లో కివిస్‌కు షాక్..

తొలి మ్యాచ్‌లో కివిస్‌కు షాక్..

తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టును మట్టి కరిపించింది హాకీ ఇండియా. గ్రూప్-ఎ విభాగంలో ఈ రెండు జట్లు తలపడ్దాయి. 3-2 గోల్స్ తేడాతో భారత్ విజయాన్ని కైవసం చేసుకుంది. మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని హాకీ జట్టు ఆరంభం నుంచే ఆధిపత్యాన్ని కనపరిచింది. ఈ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేశాడు. రూపీందర్ సింగ్ మరో గోల్ సాధించాడు. భారత హాకీ జట్టు తన రెండో మ్యాచ్‌ను ఆదివారం ఆడబోతోంది. బలమైన ఆస్ట్రేలియాను ఢీ కొట్టనుంది.

హర్మన్, రూపీందర్ హవా..

హర్మన్, రూపీందర్ హవా..

ఓఐ హాకీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ సింగ్, రూపీందర్ సింగ్‌ల హవా అసాంతం కొనసాగింది. మ్యాచ్ ఆరంభమైన పదో నిమిషంలోనే రూపీందర్ సింగ్ గోల్ సాధించాడు. 26, 33వ నిమిషంలో హర్మన్ ప్రీత్ రెండు గోల్స్ చేశాడు. న్యూజిలాండ్ జట్టు దూకుడును ప్రదర్శించిన ప్రతీసారీ భారత డిఫెండర్లు చెలరేగిపోయారు. గోల్ కీపర్ పీఆర్ శ్రీజిత్ అసాధారణ పోరాట పటిమను ప్రదర్శించాడు. కీలక సమయాల్లో న్యూజిలాండ్‌కు దక్కిన పెనాల్టీ కార్నర్లను విజయవంతంగా అడ్డుకోగలిగాడు.

గట్టిపోటీ ఇచ్చిన న్యూజిలాండ్..

ఫస్ట్ హాఫ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు చెరో గోల్‌ను సాధించిన సమవుజ్జీలుగా నిలిచాయి. మ్యాచ్ 10వ నిమిషంలో రూపీందర్, 21వ నిమిషంలో కివీస్ ఆటగాడు కేన్ రస్సెల్ గోల్‌ను సాధించడంతో స్కోర్ సమమైంది. 26వ నిమిషంలో హర్మన్ మరో గోల్ సాధించాడు. ఆ వెంటనే కివీస్ స్టార్ ప్లేయర్ జెన్నెస్సే సైతం తాను అందుకున్న బంతిని అద్భుతంగా త్రో చేశాడు. దాన్ని అడ్డుకోవడంలో శ్రీజిత్ విఫలం కావడంతో నెట్స్‌లోకి దూసుకెళ్లిందా బంతి. దీనితో మరోసారి 2-2తో భారత్, న్యూజిలాండ్ జట్లు సమంగా స్కోర్‌ను సాధించాయి.

అడ్డుగోడలా శ్రీజిత్

మ్యాచ్ చివరిదశకు వచ్చిన సమయంలో హర్మన్ ప్రీత్ మరోసారి చెలరేగాడు. 33వ నిమిషంలో గోల్ సాధించాడు. దీనితో భారత్ 3-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీనితో న్యూజిలాండ్ జట్టు భారత్ గోల్‌పోస్ట్‌పైకి చేసిన దాడులు గురి తప్పాయి. పీఆర్ శ్రీజిత్ అడ్డుగోడలా మారిపోవడంతో స్కోర్‌ను సమం చేయలేకపోయింది కివీస్ టీమ్. పూల్-ఏలో భారత్.. తన తదుపరి మ్యాచ్‌ను ఆదివారం ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియాను ఢీ కొడుతుందా మ్యాచ్‌లో. ఇదే గ్రూప్‌లో అర్జెంటీనా, స్పెయిన్‌ ఉన్నాయి.

Story first published: Saturday, July 24, 2021, 10:16 [IST]
Other articles published on Jul 24, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+