న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo Olympics 2021: చైనా జైత్రయాత్ర షురూ: డ్రాగన్ ఖాతాలో తొలి గోల్డ్: ఇంకెన్ని వచ్చి పడతాయో

Tokyo Olympics 2021: Chinese shooter Yang Qian wins 1st gold in womens 10m air rifle

టోక్యో: అంగరంగ వైభవంగా ఆరంభమైన విశ్వ క్రీడా వేదిక ఒలింపిక్స్‌లో చైనా తన ఆధిపత్యాన్ని మొదలు పెట్టింది. జైత్రయాత్రను ప్రారంభించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకాన్ని అందుకుంది డ్రాగన్ కంట్రీ. టోక్యో ఒలింపిక్స్‌లో బోణీ కొట్టింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఇప్పటిదాకా ఏ విభాగానికైనా ఇదే తొలి గోల్డ్ మెడల్. చైనాకు చెందిన స్టార్ విమెన్ షూటర్ యాంగ్ క్వియాన్.. తన తడాఖా చూపించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ కేటగిరీలో బంగారు పతకాన్ని సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో తన దేశానికి తొలి బంగారు పతకాన్ని అందించింది.

ఎదురు లేని యాంగ్..

ఎదురు లేని యాంగ్..

అసాకా షూటింగ్ రేంజ్‌లో నిర్వహించిన ఈ ఈవెంట్‌లో యాంగ్ క్వియాన్‌కు ఎదురు లేకుండా పోయింది. 251.8 పాయింట్లను సాధించిందా యంగ్ అండ్ డైనమిక్ స్టార్ షూటర్. రెండో స్థానంలో రష్యా, మూడో స్థానంలో స్విటర్జాండ్ నిలిచాయి. అనస్తాసియా గాలాషినా, మూడో స్థానంలో స్విట్జర్లాండ్‌కు చెందిన నీనా క్రిస్టీనా నిలిచారు. గాలాషినా వెండి, నీనా రజత పతకాన్ని సాధించారు. 21 సంవత్సరాల యాంగ్ క్వియాన్ టోక్యో ఒలింపిక్స్ 2021 తొలి ఛాంపియన్‌గా అవతరించారు.

క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఆరో స్థానంలో..

క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఆరో స్థానంలో..

క్వాలిఫికేషన్ రౌండ్‌లో యాంగ్ క్వియాన్ ఆరో స్థానంలో నిలిచారు. ఆమెపై పెద్దగా అంచనాలేవీ లేవు. వెండి పతకాన్ని సాధించిన ఆర్‌ఓసీ షూటర్ అనస్తాషియా గాలాషినా ఏకంగా ఎనిమిదో స్థానంలో నిలిచారు. అయిప్పటికీ.. ఫైనల్ రౌండ్‌లో వారిద్దరే తొలి రెండో స్థానాలో ఆక్రమించుకున్నారు. బంగారం, వెండి పతకాలను తమ ఖాతాలో వేసుకున్నారు. ఫైనల్ చివరి రౌండ్‌లో యాంగ్ క్వియాన్, అనస్తాషియా మధ్య గట్టి పోటీ నెలకొంది. 0.7 పాయింట్ తేడాతో అనస్తాషియా రెండో స్థానంలో నిలవాల్సి వచ్చింది.

వెంట్రుకవాసిలో బంగారానికి దూరం

వెంట్రుకవాసిలో బంగారానికి దూరం

చివరి షాట్‌లో యాంగ్ క్వియాన్ 9.8 పాయింట్లను నిలబెట్టుకోగా.. అనస్తాషియా తడబడ్డారు. వెంట్రుకవాసిలో బంగారు పతకాన్ని కోల్పోయారు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 632.9 పాయింట్లలో టాప్ పొజీషన్‌లో నిలిచిన నార్వే షూటర్ జెెనెట్టె హేగ్ ఫైనల్ రౌండ్‌లో తడబడ్డారు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో ప్రదర్శించిన దూకుడును కొనసాగించలేకపోయారు. టాప్ త్రీలో స్థానం దక్కించుకోలేకపోయారు. నాలుగో స్థానంలో నిలిచారు.

టాప్-8లో ఉన్నది వీరే..

ఫ్రాన్స్‌కు చెందిన ఓషియాన్నె ముల్లర్ అయిదో ప్లేస్‌ను దక్కించుకోగా.. అమెరికా షూటర్ మేరీ కరోలిన్ టక్కర్, రిపబ్లికన్ ఆఫ్ కొరియా క్వోన్ ఎనుజి, పార్క్ హీమూన్ ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. ఇదే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత్.. ఫైనల్‌కు క్వాలిఫై కాలేకపోయిన విషయం తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్ విభాగంలో అపూర్వి చందేలా, ఎలావెనిల్ విఫలం అయ్యారు. ఈ కేటగిరీలో అపూర్వి చందేలా 36వ స్థానంతో సరిపెట్టుకోగా.. ఎలావెనిల్ కాస్త ఫర్వాలేదనిపించారు. టాప్ 20లో నిలిచారు. 16వ స్థానాన్ని దక్కించుకోగలిగారు.

ఫైనల్ చేరలేని భారత షూటర్లు..

ఫైనల్ చేరలేని భారత షూటర్లు..

దీనితో వారిద్దరూ చివరి రౌండ్ల వరకూ నిలిచే అవకాశాన్ని కోల్పోయినట్టయింది. 626.5 పాయింట్లతో ఎలావెనిల్ 16వ స్థానంలో నిలిచారు.

తమిళనాడులోని కడలూర్‌కు చెందిన ఎలావెనిల్ చివరి సిరీస్‌లో తడబడ్డారు. ఈ విభాగంలో నార్వేకు చెందిన జెనెట్ హేగ్ ఒలింపిక్స్‌లో సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పారు. 632.0 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లారు. ఈ రౌండ్‌లో ప్రతి షూటర్ కూడా ఆరు సిరీస్‌లల్లో 10 సార్లు లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. అత్యధిక పాయింట్లను సాధించిన చివరి ఎనిమిది మంది షూటర్లను ఫైనల్‌కు అర్హత సాధించినట్లుగా ప్రకటిస్తారు. ఈ టాప్ 8లో భారతీ షూటర్లు చోటు దక్కించుకోలేకపోయారు. అపూర్వి చందేలా 621.9 పాయింట్లు, ఎలావెనిల్ 626.5 పాయింట్లను సాధించారు.

Story first published: Saturday, July 24, 2021, 9:22 [IST]
Other articles published on Jul 24, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X