న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అచ్చం ఒలింపిక్స్‌ రింగుల్లానే.. మీరాబాయి చాను చెవి పోగుల వెనుక పెద్ద కథే ఉందే!!

Tokyo Olympics 2021: Big story behind Mirabai Chanus Earrings
Weightlifter Saikhom Mirabai ChanuSuccess Story | Oneindia Telugu

హైదరాబాద్: దాదాపు 21 ఏళ్ల త‌ర్వాత‌ ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భార‌త్‌కు మెడ‌ల్ దక్కింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి కాంస్య ప‌త‌కం గెల‌వ‌గా.. టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను ర‌జ‌త‌ ప‌త‌కం గెలుచుకుంది. దీంతో భారత త్రివర్ణ పతాకం అంతర్జాతీయ వేదికగా రెపరెపలాడింది. టోక్యోలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడంతో యావత్ భారతావని ఆనందంలో ఉప్పొంగిపోయింది. ఇక మెడ‌ల్ గెలిచిన స‌మ‌యంలో మీరా క‌ళ్ల‌లో మెరిసిన ఆనందం అందరిని ఆక‌ట్టుకుంది. అదే స‌మ‌యంలో ఆమె చెవి రింగులు కూడా ప్రత్యేకంగా నిలిచాయి. మీరా చెవి పోగులు అచ్చం ఒలింపిక్స్‌ రింగుల్లానే ఉండడంతో.. ఎందుకలా ఉన్నాయని అందరూ ఆలోచిస్తున్నారు. అయితే చెవి పోగుల వెనుక పెద్ద కథే ఉంది.

అనుష్క శర్మకు వార్నింగ్ ఇచ్చిన షోయబ్ అక్తర్.. ఎందుకో తెలుసా?అనుష్క శర్మకు వార్నింగ్ ఇచ్చిన షోయబ్ అక్తర్.. ఎందుకో తెలుసా?

చిన్న‌త‌నం నుంచి వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ కోసం మీరాబాయ్ చాను ఎంతో క‌ష్ట‌ప‌డింది. 2011లో జూనియ‌ర్ కేట‌గిరీలో తొలిసారి నేష‌న‌ల్ మెడ‌ల్ గెలిచింది. 2014లో జ‌రిగిన కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లోనూ అంత‌ర్జాతీయ వేదిక‌పై మెరిసి.. 48 కేజీల విభాగంలో సిల్వ‌ర్ మెడ‌ల్ అందుకుంది. అదే ఏడాది ఏషియ‌న్ గేమ్స్‌లో బ‌రిలోకి దిగి విఫ‌ల‌మైంది. దీంతో 2016 రియో ఒలింపిక్స్ ల‌క్ష్యంగా పెట్టుకుంది. త‌న కూతురు ప‌డుతున్న క‌ష్టాన్ని చూసిన మీరా త‌ల్లి సైఖోమ్ ఓంగ్బీ టాంబీ లైమా ఒక బ‌హుమ‌తినిచ్చింది. అవే ఒలింపిక్స్‌ రింగుల్లాంటి చెవి పోగులు. ఈ రింగులతో తన బిడ్డకు విజయం వరించాలని ఆమె కోరుకున్నారు.

మీరాబాయి చానుకి చెవి రింగులు చేయించేందుకు ఇంట్లో ఉన్న బంగారం మొత్తం అమ్మేసింది సైఖోమ్. అంతేకాదు ఇంట్లోని డ‌బ్బు మొత్తం పెట్టి ఒలింపిక్స్‌ రింగ్స్‌ను పోలిన చెవి దిద్దుల‌ను చేయించింది. కానీ 2016 రియో ఒలింపిక్స్‌లో చానుకు తీవ్ర నిరాశ ఎదురైంది. క్లీన్ అండ్ జెర్క్‌లో ఒక్క‌సారి కూడా బ‌రువు ఎత్త‌లేక నిరాశ‌తో వెనుదిరిగింది. దీంతో ఆ తల్లి కల నెరవేరలేదు. తీవ్ర నిరాశకు గురైన మీరా.. ఓ సమయంలో ఆటను వ‌దిలేయాల‌ని భావించింది. కానీ అమ్మ ఇచ్చిన ఆ చెవి రింగుల‌ను చూసిన‌ప్పుడ‌ల్లా.. చానులో ప‌ట్టుద‌ల మ‌రింత పెరిగింది. ఆ క్రమంలో మళ్లీ తన ఆటపై దృష్టి పెట్టింది. టోక్యో కోసం కష్టపడింది. కరోనా కారణంగా గేమ్స్ ఏడాది వాయిదాపడ్డా ఎలాంటి నిరాశకు గురికాలేదు. చివరకు టోక్యో ఒలింపిక్స్‌లో ర‌జ‌త ప‌తాకాన్ని సాధించి అమ్మ క‌ల‌ను నెర‌వేర్చింది మీరా.

మీరాబాయి చాను ఆటను టీవీలో చూస్తూ సైఖోమ్ సంతోషంతో ఉప్పొంగిపోయారు. 'టోక్యో ఒలింపిక్స్‌లో కచ్చితంగా స్వర్ణం సాధిస్తానని, లేదంటే కనీసం పతకం అయినా సొంతం చేసుకుంటానని మీరాబాయి చాను ఎంతో నమ్మకంతో చెప్పింది. ఆ ఆనంద క్షణాల కోసం మేం ఎంతగానో ఎదురుచూశాం. మీరా విజయాన్ని చూసేందుకు మా బంధువులు, మిత్రులు నిన్నే మా ఇంటికి వచ్చారు. అంతా కలిసి బయట టీవీ పెట్టుకుని చూశాం. మా అమ్మాయి గెలవగానే మేమంతా సంతోషంలో మునిగిపోయాం. మా ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది' అని మీరా తల్లి చెప్పారు. గేమ్ ప్రారంభానికి ముందు మీరా ఇంటికి వీడియో కాల్‌ చేసి ఆశీర్వాదం తీసుకుందని ఆమె బంధువులు తెలిపారు.

Story first published: Saturday, July 24, 2021, 20:22 [IST]
Other articles published on Jul 24, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X