ఈ ఓటమి అవమానకరం..బాధాకరం: క్వార్టర్స్‌లో గురి తప్పిన బాణం: జీరోతో వెనక్కి

టోక్యో: జపాన్ వేదికగా సాగుతోన్న ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో నాలుగో రోజు భారత్.. మిశ్రమ ఫలితాలను చవి చూసింది. ఆరంభంలో ప్రదర్శించిన దూకుడు.. సన్నగిల్లింది. తరువాతి రౌండ్లలో ఓటమిని చవి చూస్తూ వచ్చారు భారత అథ్లెట్లు. ఫెన్సింగ్, పురుషుల అర్చరీ, టేబుల్ టెన్నిస్.. ఇలా ఈ ఉదయం ఉత్సాహాన్ని ఇచ్చిన మ్యాచ్‌లన్నీ తదుపరి రౌండ్‌లల్లో నీరుగార్చాయి.. పరాభవానికి దారి తీశాయి. దీనితో భారత అథ్లెట్ల ప్రస్థానంలో ఓ భాగం ముగిసినట్టుగానే కనిపిస్తోంది. ఇక వారంతా ఒక్కొక్కరుగా స్వదేశానికి తిరుగుముఖం పట్టబోతోన్నారు. రజత పతకధారి మీరాబాయి చాను ఇప్పటికే స్వదేశానికి తిరుగుప్రయాణం అయ్యారు.

ప్రభావం చూపలేకపోయిన అర్చర్లు..
పురుషుల అర్చరీలో అద్భుత ప్రదర్శన చేసిన భారత అర్చర్లు.. క్వార్టర్స్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఎలిమినేషన్ రౌండ్‌లో చూపిన ప్రతిభాపాటవాలను క్వార్టర్స్‌లో ప్రదర్శించలేకపోయారు. ఫలితంగా పరాజయం పలకరించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో బలమైన దక్షిణ కొరియా అర్చర్లను ఎదుర్కొనాల్సి రావడం శాపంగా పరిణమించింది. వారిని అధిగమించి సెమీ ఫైనల్‌లో చేరలేకపోయారు. క్వార్టర్ ఫైనల్స్‌లో భారత అర్చర్లు అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్ పోటీ పడ్డారు. దక్షిణ కొరియాకు చెందిన కిమ్ జె డెయోక్, కిమ్ వూజిన్, ఓహ్ జిన్‌హెక్‌లను ఢీ కొట్టారు.

సెట్ల వారీగా పాయింట్లు..
తొలుత దక్షిణ కొరియా అర్చర్లు 10-10-9తో సెట్‌ను ఆరంభించారు. దీనితో ఆ దేశం ఖాతాలో 29 పాయింట్ల పడ్డాయి. వారికి పోటీగా భారత అర్చర్లు ధీటుగా స్పందించలేకపోయారు. 8-10-10తో తొలి సెట్ తొలి రౌండ్‌ను ముగించారు. ఒక పాయింట్ తేడాతో దక్షిణ కొరియా ముందడుగు వేసింది. తొలి సెట్ రెండో రౌండ్‌లో దక్షిణ కొరియాకు ఎదురు లేకుండా పోయింది. 10-10-10తో ఆ సెట్‌ను ముగించారు. ఇక్కడ కూడా భారత్ విఫలమైంది. దీనికి ప్రతిగా 9-10-10 పాయింట్లను ఆర్జించింది. ఈ సెట్‌లో రెండు పాయింట్ల ఆధిక్యత దక్షిణ కొరియాకు వెళ్లింది.
పాయింట్లవారీగా
రెండో సెట్‌లోనూ దక్షిణ కొరియా భారత్‌పై రెండు పాయింట్ల ఆధిక్యతను సాధించింది. ఈ సెట్‌లో భారత అర్చర్లు 9, 10, 10, 10, 10, 8తో 57 పాయింట్లను దక్కించుకోగా.. దక్షిణ కొరియా 10, 9, 10, 10, 10, 10లతో 59కి దూసుకెళ్లింది. మూడో సెట్‌లో భారత్ ఆధిక్యతను ప్రదర్శించింది.
ఈ సెట్‌లో భారత అర్చర్లు 9, 9, 8, 9, 10, 9తో మొత్తం 56 పాయింట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. దక్షిణ కొరియా భారత్‌ను అందుకోలేకపోయింది. ఈ మూడో రౌండ్‌లో రెండు పాయింట్లకు దూరంగా నిలిచింది. మొత్తంగా 8, 10, 10, 9, 10, 9 స్కోరుతో 54 పాయింట్లను సంపాదించింది. ఈవెంట్ ముగిసే సరికి మొత్తంగా ఆరు పాయింట్ల ఆధిక్యాన్ని సాధించింది దక్షిణ కొరియా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications