కజక్..ఫసక్: ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన భారత్

టోక్యో: జపాన్ వేదికగా సాగుతోన్న ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో నాలుగో రోజు భారత్ శుభారంభం చేసింది. విజయంతో తన పతకాల వేటను ప్రారంభించింది. ఫెన్సింగ్‌లో అద్భుత విజయాన్ని అందుకుంది. భారత స్టార్ ఫెన్సర్ చదలవాడ ఆనంద సుందరరామన్ భవానీ దేవి తన తరువాతి రౌండ్‌కు దూసుకెళ్లారు. ఆరు నిమిషాల్లోనే తన రౌండ్‌ను ముగించేశారామె. అదే సమయంలో పురుషుల అర్చరీలో భారత్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ రెండు విజయాలు వెంటవెంటనే నమోదయ్యాయి.

కజక్..కసక్
ఈ రెండు ఈవెంట్లల్లో ప్లేయర్లు ఆడిన తీరు మెడల్స్‌పై ఆశలను రేకెత్తించాయి. పురుషుల అర్చరీ ఎలిమినేషన్ రౌండ్ జపాన్ కాలమానం ప్రకారం..ఈ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైంది. ఈ రౌండ్‌లో భారత అర్చర్లు అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్ పోటీ పడ్డారు. కజకిస్తాన్‌కు చెందిన అబ్దుల్లిన్ ఇల్ఫత్, గంకిన్ డెనిస్, ముస్సయేవ్ శాంఝర్‌ను ఢీ కొట్టారు. ఈ రౌండ్‌ను వారు ఏకపక్షంగా మార్చివేశారు. కజకిస్తాన్ అర్చర్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. 6-2 తేడాతో ఓడించారు.

సెట్ల వారీగా పాయింట్లు..
తొలుత కజకిస్తాన్ అర్చర్లు 10-9-9తో ఆరంభించారు. వారికి పోటీగా భారత్ 9-9-8 స్కోర్‌ను సాధించింది. ఆ తరువాతి సెట్‌లో కజక్ ఆర్చర్లు విఫలం అయ్యారు. 8-8-10 పాయింట్లను సాధించారు. దీనితో భారత త్రయం ఊపిరి పీల్చుకోగలిగింది. అతాను దాస్, ప్రవీణ్ జాదవ్ పదేసి చొప్పున పాయింట్లను సాధించడంతో భారత్‌కు రెండు పాయింట్ల ఆధిక్యత లభించింది. 10-10-9 స్కోర్‌ను సాధించింది భారత్. రెండో సెట్‌లో కజకిస్తాన్ తన వైఫల్యాన్ని కొనసాగిచింది.

థర్డ్ రౌండ్‌లో గట్టి పోటీ..
తొలి సెట్ తొలి రౌండ్‌లో కంటే అధ్వాన్నంగా కనిపించారు. రెండో సెట్ తొలి రౌండ్‌లో 8-8-8 పాయింట్లను నమోదు చేయగా.. ఆ అవకాశాన్ని భారత అర్చర్లు ఏ మాత్రం వదలుకోలేదు. వారికంటే అధిక పాయింట్ల సాధించారు. ఈ రౌండ్‌లో కూడా రెండు పాయింట్ల ఆధిక్యాన్ని భారత అర్చర్లు నమోదు చేశారు. మూడో సెట్‌లో మాత్రం కజకిస్తాన్ ఆర్చర్లు రెచ్చిపోయారు. భారత్‌తో సమానంగా పాయింట్లను సాధించారు. 10-10-9తో మూడో సెట్ రెండు రౌండ్లనూ ముగించారు.

ఫోర్త్ రౌండ్‌లో ఆధిక్యత..
ఈ రౌండ్‌లో భారత అర్చర్ల త్రయం వారికి ధీటుగా సమాధానం ఇచ్చింది. ఆధిక్యతను తగ్గనివ్వలేదు. ఈవెంట్ ఫలితాన్ని శాసించే నాలుగో రౌండ్‌లో అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్ అద్భుతంగా రాణించారు. నాలుగో సెట్‌లో 10,8,9,8,10,10:55 పాయింట్లను అందుకోగా.. కజకిస్తాన్ అర్చర్లు 9,9,10,7,9,10:54 పాయింట్లు చేశారు. పాయింట్ల ఆధారంగా భారత్ విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్‌లో అడుగు పెట్టింది. ఇందులో ప్రపంచ ఛాంపియన్ దక్షిణ కొరియా అర్చర్లను భారత త్రయం ఢీ కొట్టాల్సి ఉంది. ఈ రౌండ్ ఈ ఉదయం 10:15 నిమిషాలకు ప్రారంభమౌతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications