For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo Olympics 2020: అమెరికాకు భారీ షాక్.. సిమోన్ బైల్స్‌కు గాయం! టీమ్ ఈవెంట్‌ నుంచి ఔట్!

Tokyo Olympics 2020: Simone Biles Withdraws From Womens Gymnastics Team Finals

టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌ 2020లో గోల్డ్ మెడల్ ఖాతాలో వేసుకుందామనుకున్న అమెరికాకు భారీ షాక్ తగిలింది. జిమ్నాస్టిక్ ప్లేయర్ సిమోన్ బైల్స్ మంగళవారం మహిళల టీమ్ ఈవెంట్ నుంచి త‌ప్పుకుంది. వాల్ట్ సంద‌ర్భంగా బైల్స్ గాయ‌ప‌డ‌టంతో మ‌ధ్య‌లోనే ఈవెంట్ వ‌దిలి వెళ్లిపోయింది. స్టార్ జిమ్నాస్టిక్స్ అయిన ఈ 24 ఏళ్ల బైల్స్‌.. ఓ ట్రైన‌ర్ సాయంతో ఫ్లోర్ నుంచి త‌ప్పుకుంది. బార్స్‌ ఈవెంట్ ప్రారంభం అయ్యేముందు ఈ ఘటన జరిగింది. జట్టు ఈవెంట్‌లో ఆమె ఇక పాల్గొనదని ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఓ ప్రకటనలో ధృవీకరించింది.

ట్రైన‌ర్ సాయంతో ఫ్లోర్ నుంచి బయటకు వెళ్లిన సిమోన్ బైల్స్.. కొద్దిసేప‌టి త‌ర్వాత కాలికి క‌ట్టుతో మ‌ళ్లీ వ‌చ్చింది. తన టీమ్ మేట్స్‌ను హ‌గ్ చేసుకొని కాంపిటిష‌న్ నుంచి త‌ప్పుకుంది. వ‌రుస‌గా మూడోసారి ఒలింపిక్ గోల్డ్ మెడ‌ల్ గెల‌వాల‌న్న అమెరికా ఆశ‌ల‌కు గ‌ట్టి దెబ్బ ప‌డింది. ఇక ఈ కాంపిటిష‌న్‌లో బైల్స్ లేకుండానే అమెరికా మహిళల టీమ్ పాల్గొనాల్సి ఉంటుంది. ఇక విశ్వ క్రీడల్లో ఆమె కొనసాగగలదా లేదా అన్నది బుధవారం తేలనుంది. ఒకవేళ ఆమె పోటీల్లో పాల్గొనాలంటే మెడికల్ క్లియరెన్స్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.

ఒలింపిక్స్‌లో అయిదు స్వర్ణ పతకాలు సాధించాలనే లక్ష్యంతో బరిలో దిగిన అమెరికా సంచలన జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ ఆరు ఈవెంట్లలో ఫైనల్స్‌కు అర్హత సాధించింది. వాల్ట్‌, ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌, బ్యాలెన్సింగ్‌ బీమ్‌, అన్‌ఈవెన్‌ బార్స్‌తో పాటు టీమ్‌, ఆల్‌రౌండ్‌ విభాగాల్లో పోటీకి సిద్ధమైంది. 1992లో షెనోన్‌ (అమెరికా) తర్వాత ఆరు విభాగాల్లో ఫైనల్‌ ఆడబోతున్న ఘనత బైల్స్‌దే. ఫైనల్లో కనీసం 5 స్వర్ణాలు సాధిస్తే.. ఒకే ఒలింపిక్స్‌లో అత్యధిక పసిడి పతకాలు గెలిచిన రికార్డు ఆమె సొంతం కానుంది. అయితే గాయం రూపంలో ఆమెకు షాక్ తగిలింది.

ఈసారి ఫైనల్‌ చేరే క్రమంలో అన్‌ఈవెన్‌బార్స్‌, ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌లో బైల్స్‌ తడబడింది. ఫ్లోర్‌లో నిర్దేశిత ప్రాంతంలో కాకుండా బయటకు దూకడంతో ఈ ఈవెంట్లో ఆమె 14.566 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. బ్యాలెన్సింగ్‌ బీమ్‌లో కిందకి దూకే సమయంలో బైల్స్‌ నియంత్రణతో దూకలేకపోయింది. దాదాపు పట్టు జారబోయింది. ఈ విభాగంలో అమెరికా అమ్మాయి సనీసా లీ (15.200) అగ్ర స్థానంలో నిలిచింది. బైల్స్‌ అంచనాలు అందుకోకపోవడంతో టీమ్‌ విభాగంలో ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండే అమెరికా (170.562) రెండో స్థానానికి పరిమితమైంది. రష్యా ఒలింపిక్‌ కమిటీ (171.629) అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

Story first published: Tuesday, July 27, 2021, 18:55 [IST]
Other articles published on Jul 27, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+