టోక్యో నుంచి సప్పోరొ సిటీకి: మా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదన్న ఐఓసీ చైర్మన్

హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్‌లో జరిగే మారథాన్, నడక రేసు వేదికలను మారుస్తూ గతంలో తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పూలేదని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) చైర్మన్ జాన్ కొయేట్స్ మరోసారి స్పష్టం చేశారు. టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా జరిగే మారథాన్, నడక రేసు వేదికలను టోక్యో నుంచి సప్పోరొ సిటీకి మారుస్తూ ఐఓసీ నిర్ణయం తీసుకుంది.
ఐఓసీ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో శుక్వరారం ఐఓసీ చైర్మన్ జాన్ కొయేట్స్ మాట్లాడుతూ ఒలింపిక్స్ జరిగే జూలై, ఆగస్టులో టోక్యోలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని, అలాంటి వేడి వాతావరణంలో మారథాన్, నడక రేసులను నిర్వహించి అథ్లెట్ల ప్రాణాలతో చెలగాటం ఆడలేమని ఆయన పేర్కొన్నారు.
అందుకే వాటిని టోక్యో నుంచి ఉత్తర జపాన్‌లోని సప్పోరొ సిటీకి మార్చినట్లు తెలిపారు. మారథాన్, నడక రేసుల్లో విజేతలుగా నిలిచిన అథ్లెట్లకు పతకాల ప్రధానం మాత్రం టోక్యోలోనే నిర్వహిస్తామని తెలపడం విశేషం. ఇటీవల దోహాలో ముగిసిన ప్రపంచ అథ్లెట్ల చాంపియన్‌షిప్ మారథాన్‌లో పాల్గొన్న పలువురు అథ్లెట్లు ఎండ వేడిమి తట్టుకోలేక రేసు నుంచి మధ్యలోనే వైదొలిగిన సందర్భాన్ని గుర్తు చేశారు.
టోక్యో ఒలింపిక్స్‌లో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకూడదనే ఐఓసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తమ నిర్ణయం ఒలింపిక్ అభిమానులను బాధ పెడుతున్నప్పటికీ అథ్లెట్ల శ్రేయస్సే మాకు ముఖ్యం అని ఐఓసీ చైర్మన్ జాన్ కొయేట్స్ స్పష్టం చేశారు. జాన్ నిర్ణయంపై టోక్యో గవర్నర్ యురికో కోయ్‌కె అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications